మచ్చలు పోవడానికి | Sakshi
Sakshi News home page

మచ్చలు పోవడానికి

Published Mon, Mar 27 2017 12:00 AM

మచ్చలు పోవడానికి

అందమె ఆనందం

కొబ్బరి నూనెలో గోరింటాకు పొడి కలిపి పేస్టు చేసుకుని ముఖానికి పట్టిస్తే మచ్చలు పోతాయి. కొబ్బరి నూనె బదులుగా మరే ఇతర నూనెనయినా వాడవచ్చు.

అర టీ స్పూన్‌ నిమ్మరసంలో నాలుగు చుక్కల గ్లిజరిన్‌ కలిపి మచ్చల మీద రాస్తుంటే మచ్చలు పోతాయి.

కరివేపాకులో చిటికెడు పసుపు వేసి గ్రైండ్‌ చేసి మచ్చల మీద రాసి పదిహేను నిమషాల తర్వాత కడగాలి.  

గోరింటాకు పొడిలో చిటికెడు పసుపు కలిపి మచ్చల మీద రాయాలి.

ఎండిన తులసి, వేప, పుదీన ఆకులు ఒక్కొక్కటి వందగ్రాములు తీసుకుని అందులో చిటికెడు పసుపు వేసి కలుపుకుని నిలవ ఉంచుకోవాలి. వాడేటప్పుడు రెండు టీ స్పూన్ల పొడిలో తగినంత పన్నీరు వేసి కలుపుకుని ముఖానికి పట్టించాలి.

తమలపాకుల్లో కొద్దిగా కొబ్బరినూనె కలిపి గ్రైండ్‌ చేసి మచ్చల మీద రాయాలి.
తులసి ఆకులలో పసుపు వేసి గ్రైండ్‌ చేసి ముఖానికి పట్టించాలి.

దోసకాయ రసాన్ని ముఖానికి పట్టించి పదిహేను నిమిషాల తర్వాత కడిగితే గీతలు, మచ్చలు తగ్గడమే కాకుండా చర్మం బిగుతుగా కూడ ఉంటుంది.

తేనెలో కుంకుమ పువ్వు కలిపి రంగరించి మచ్చల మీద రాయాలి.

Advertisement
Advertisement