అదే పనిగా తుమ్ములు... తగ్గేదెలా?

అదే పనిగా తుమ్ములు... తగ్గేదెలా?


హోమియో కౌన్సెలింగ్

 


నా వయసు 25 ఏళ్లు. నేను గత ఆర్నెల్లుగా తుమ్ములు, ముక్కుకారడం, ముక్కు బిగుసుకున్నట్లుగా ఉండటం, వాసనలు గ్రహించలేకపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నాను. నేను చాలా మంది వైద్యులను సంప్రదించాను. సమస్య తగ్గినట్టే తగ్గి మళ్లీ వస్తోంది. కాబట్టి హోమియోలో దీనికి పరిష్కారం చెప్పగలరు. - నరసింహారావు, కర్నూలు

మీరు చెబుతున్న సమస్య ఈ రోజుల్లో చాలా మందిని బాధిస్తోంది. దీన్ని అలర్జిక్ రైనైటిస్ అంటారు. ఈ సమస్య ఉన్నవారిలో వేరే సమస్యలు (దుమ్ము, పుప్పొడి, ఘాటు వాసనలు) తగిలి ముక్కుల్లోని పొరలు ఉబ్బి, ఈ సమస్య మొదలువుతుంది. ఇది అలర్జీ వల్ల జరుగుతుంద. అలర్జి సమయంలో శరీరంలో హిస్టమైన్స్ విడుదల అవుతాయి. దీనివల్ల ముక్కులోని రక్తనాళాలు ఉబ్బినట్లుగా అయిపోయి, పొరలు కూడా ఉబ్బి ఆగకుండా తుమ్ములు, ముక్కు వెంట నీరు కారడం మొదలువుతుంది. తర్వాత ముక్కు బిగుసుకుపోవడం జరుగుతుంది. ఈ దశలోనే చికిత్స తీసుకోవడం మంచిది.



కారణాలు :  ధూళి, పూలు, పుప్పొడి, కాలుష్యం, చల్లటి వాతావరణం, కొంతమందిలో ముక్కు దూలం, రంధ్రాల మధ్య గోడ కాస్త వంకరంగా ఉండటం కొన్ని కారణాలు. ఇవి మాత్రమే గాక చాలా అంశాలు ఈ సమస్యకు దారితీస్తాయి.

 

లక్షణాలు :  ఆగకుండా విపరీతంగా తుమ్ములు రావడం ముక్కుకారడం  ముక్కు బిగదీసుకుపోయినట్లుగా అనిపించడం  ముక్కులో మొదలైన అలర్జీ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే సైనస్‌లకు ఇన్ఫెక్షన్ సోకి  తలబరువు, తలనొప్పి వంటివి రావచ్చు.  ముక్కులోని పొరలు ఉబ్బటం వల్ల గాలి లోపలికి వెళ్లక వాసనలు కూడా తగ్గిపోతాయి. దీన్ని నిర్లక్ష్యం చేస్తే సమస్య మెల్లమెల్లగా అధికమై మున్ముందు సైనసైటిస్, ముక్కులో కండపెరగడం, ఘ్రాణశక్తి తగ్గిపోవడం వంటి పెద్దపెద్ద సమస్యలు రావడానికి అవకాశం ఉంది.

 

నిర్ధారణ : వ్యాధి లక్షణాలు తెలుసుకోవడం, ఎక్స్‌రే, సీటీ స్కాన్

 

నివారణ : అలర్జీలు కలిగించే అంశాలకు సాధ్యమైనంత దూరంగా ఉండటం  సరైన పోషకాహారం తీసుకోవడం  చల్లని వాతావరణానికి దూరంగా ఉండటం  పొగతాగే అలవాటును మానేయడం.

 

చికిత్స: రోగి స్వభావాలను బట్టి తగిన కాన్స్‌టిట్యూషనల్ చికిత్స అదించడం ద్వారా రోగనిరోధకశక్తిని క్రమంగా పెంచుతూ వ్యాధిని పూర్తిగా తగ్గించవచ్చు.

 

డాక్టర్ ఎ.ఎం. రెడ్డి

సీనియర్ డాక్టర్  పాజిటివ్ హోమియోపతి హైదరాబాద్

 

న్యూరాలజీ కౌన్సెలింగ్

ఫిట్స్ అదుపులోకి వచ్చేదెలా..?


నా వయసు 25 ఏళ్లు. గత ఎనిమిదేళ్లుగా మూర్చ వ్యాధి (ఫిట్స్)తో బాధపడుతున్నాను. ఉదయం నిద్రలేవగానే ఎక్కువగా ఉలిక్కిపడుతున్నాను. చేతిలోని వస్తువులు కింద  పడిపోతున్నాయి. కాళ్లు, చేతులు కొట్టుకుంటూ స్పృహతప్పి పడిపోతాను. మా అమ్మకు కూడా ఇలాగే ఉండేదట. తల స్కానింగ్ చేసి బాగానే ఉందని డాక్టర్ చెప్పారు. నా సమస్యకు తగిన పరిష్కారం చూపించండి.  - సుందర్, నల్లగొండ

మీరు చెబుతున్న అంశాలను బట్టి జువెనైల్ మయోక్లోనిక్ ఎపిలెప్సీ అనే జబ్బుతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇది జన్యుపరమైన కారణాల వల్ల వంశపారంపర్యంగా వస్తుంది. మీరు ఈఈజీ అనే పరీక్ష చేయించుకోవాలి. దానితో జబ్బు తీవ్రత తెలుస్తుంది. తర్వాత వాల్‌ప్రొయేట్ అనే మందులు వాడటం ద్వారా ఫిట్స్‌ను కంట్రోల్‌లో పెట్టుకోవచ్చు. అయితే ఈ మందులు న్యూరాలజిస్ట్‌ను సంప్రదించి, ఆయన పర్యవేక్షణలోనే వాడాల్సి ఉంటుంది.

 

నా వయసు 30 ఏళ్లు. గత రెండు నెలలో మూడు సార్లు ఫిట్స్ వచ్చాయి. కొంచెం తలనొప్పిగా ఉంటోంది. మా ఊళ్లో డాక్టర్‌ను కలిసి మందులు తీసుకున్నాను. ఆ మందులు వాడాక కూడాఫిట్స్ వచ్చాయి. అవి తగ్గడానికి ఏం చేయాలి?

 - సుభాష్, జడ్చర్ల


మీరు ఒకసారి సీటీ స్కాన్ చేయించుకోవాలి. ఒక్కోసారి మన కడుపులో ఉండే నులిపురుగులు మెదడులోకి ప్రవేశించి ఫిట్స్ రావడానికి కారణమవుతాయి. దీనికి రెండు వారాల నుంచి నాలుగు వారాల వరకు మెడిసిన్ వాడాల్సి ఉంటుంది. మీ ఫిట్స్ మందులు కూడా మార్చాల్సి రావచ్చు. మీ స్కానింగ్ రిపోర్ట్‌ల ఆధారంగా మందులు ఎన్నాౠఉ్ల వాడాలనేది చెప్పవచ్చు. మీకు మద్యం తీసుకునే అలవాటు ఉంటే దాన్ని పూర్తిగా మానేయాలి.

 

 నా వయసు 60 ఏళ్లు. పక్షవాతం వచ్చి నాలుగేళ్లు అయ్యింది. అయితే గత నెల రోజులుగా నాలుగుసార్లు ఫిట్స్ వచ్చాయి. డాక్టర్‌కు చూపిసుఏ్త పెద్దాసుపత్రికి వెళ్లమని చెప్పారు. నాకు సరైన సలహా ఇవ్వండి.

 - సుదర్శన్‌రావు, వరంగల్


 మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీరు ఇస్కిమిక్ సీజర్స్‌తో బాధపడుతున్నట్లు కనిపిస్తోంది. పక్షవాతం వచ్చినవారిలో ఫిట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంద. మీరు సీటీస్కాన్, ఈఈజీ ద్వారా ఫిట్స్‌ను తగ్గించవచ్చు. మీరు ఈ మందులను కనీసం మూడేళ్ల పాటు వాడాల్సి ఉంటుంది. కొంతమంది జీవితాంతం కూడా మందులు వాడాల్సి రావచ్చు.

 

నాకు ఇరవైఏళ్లు. గత పదేళ్లుగా ఫిట్స్ వస్తున్నాయి. అవి వచ్చే ముందు పిచ్చిచేష్టలు, వెకిలినవ్వులు చేస్తుంటానని చూసినవాళ్లు చెప్పారు. నాకైతే అవేమీ తెలియదు. దీనివల్ల నేను పనికి కూడా వెళ్లలేకపోతున్నాను. సరైన సలహా ఇవ్వండి.  - కిశోర్, మంచిర్యాల

మీరు టెంపోరల్ ఎపిలెప్సీ అనే సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ జబ్బుకు ఇప్పుడు ఎన్నో మందులు అందుబాటులో ఉన్నాయి. సరైన మోతాదులో మందులు వాడటం వల్ల జబ్బు తగ్గుతుంది. దగ్గర్లోని న్యూరాలజిస్ట్‌కు చూపించండి. ఒకవేళ మందులతో జబ్బు తగ్గకపోతే ఆపరేషన్ ద్వారా కూడా ఫిట్స్‌ను నియంత్రించవచ్చు.

 

డాక్టర్ మురళీధర్ రెడ్డి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్

కేర్ హాస్పిటల్  బంజారాహిల్స్  హైదరాబాద్

 

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top