
ఎందుకు ఏమిటి ఎలా?
పుస్తకాలు మన జీవితంలో స్నేహితుల లాంటివి. అవి విజ్ఞానాన్ని అందించడమే కాకుండా అనేక కథలు, కవితలతో మనల్ని వినోదపరుస్తాయి. అయితే మీరెప్పుడైన కొత్త పుస్తకం తెరిచి చదివారా? పుస్తకం తెరిచినప్పుడు వచ్చే ఆ ప్రత్యేకమైన వాసనను ఎప్పుడైనా గమనించారా? ఈ వాసన పుస్తకాలను మరింత ఆకర్షణీయంగా చేస్తుంది. అయితే ఆ వాసనకు గల శాస్త్రీయ కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మొదటగా పుస్తకాలు కాగితాలతో తయారవుతాయి. కాగితాలు చెట్లనుండి తయారు చేస్తారని మనందరికీ తెలుసు. అలా తయారు చేసేటప్పుడు లిగ్నిన్ అనే రసాయనాన్ని ఉపయోగించడం వలన చెక్క వంటి ఒక వాసన ఏర్పడుతుంది. ఇంకొక కారణం, పుస్తకంలోని అక్షరాలు, చిత్రాలు ముద్రించడానికి ఉపయోగించే సిరాలో రసాయనాలు ఉంటాయి. ఈ సిరా కొత్తగా ముద్రించినప్పుడు ఒక సుగంధం లాంటి వాసనను వెదజల్లుతుంది. ఇది కొంచెం రబ్బరు లేదా రంగుల వాసనలా ఉంటుంది. మరొక కారణం పుస్తకం యొక్క పేజీలను కలిపి బైండ్ చేయడానికి గ్లూ ఉపయోగిస్తారు. ఈ గ్లూ కూడా తయారీలో ఉపయోగించే రసాయనాల వల్ల ఒక ప్రత్యేకమైన వాసనను వెదజల్లుతుంది.
చదవండి: గైడో, డ్రైవరో కాదు నా భర్త.. మహిళ అసహనం : బై డిఫాల్ట్ భర్తలందరూ డ్రైవర్లేగా!
చివరగా, పుస్తకాలు ముద్రించే యంత్రాలు, కాగితం లేదా కవర్‌పై ఉపయోగించే రసాయనాలు కూడా ఈ వాసనకు కారణమవుతాయి. కొత్తగా ముద్రించిన పుస్తకం తెరిచినప్పుడు ఈ రసాయనాలు గాలిలో కలిసి ఆ వాసనను ఇస్తాయి!
ఇదీ చదవండి: మెకంజీ షాక్, ప్రియురాలితో రెండో పెళ్లికిముందే జాగ్రత్తపడుతున్న జెఫ్ బెజోస్