ఇంటిప్స్ | home made tips | Sakshi
Sakshi News home page

ఇంటిప్స్

Published Mon, Oct 17 2016 11:01 PM | Last Updated on Mon, Sep 4 2017 5:30 PM

ఇంటిప్స్

పప్పులకు పురుగు పట్టకుండా ఉండాలంటే... పప్పులు, తృణ ధాన్యాలు పురుగు పట్టకుండా ఉండాలంటే వాటిని నిల్వ ఉంచిన డబ్బాలో కొన్ని వేపాకులను పెడితే చాలు.  వంట చేసేటప్పుడు స్టవ్ మీద పడిన మరకలు అంత సులువుగా పోవు.

అలాంటప్పుడు పెద్ద సైజు టొమాటో ముక్కను తీసుకొని దాన్ని ఉప్పులో ముంచి మరకలపై రుద్దాలి. ఇలా చేస్తే ఎలాంటి మరకలైనా త్వరగా పోతాయి. అంతే కాకుండా ఎన్నేళ్ల స్టవ్ అయినా కొత్తదానిలా మిలమిలా మెరుస్తుంది. కాఫీ మరింత రుచిగా ఉండాలంటే, డికాషిన్‌లో కొద్దిగా ఉప్పు వేసి మరిగించాలి.

 

 

Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement