హాలీవుడ్ యోగా | Hollywood yoga | Sakshi
Sakshi News home page

హాలీవుడ్ యోగా

Dec 23 2015 11:49 PM | Updated on Sep 3 2017 2:27 PM

హాలీవుడ్ యోగా

హాలీవుడ్ యోగా

యోగా ఒకప్పుడు భారత ఉపఖండానికే పరిమితమై ఉండేది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది.

మనశ్శాంతితో ఉంటున్నాను!

యోగా ఒకప్పుడు భారత ఉపఖండానికే పరిమితమై ఉండేది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది.  పాశ్చాత్యదేశాలు యోగా వైపు మొగ్గు చూపుతున్నాయి. శారీరక ఆరోగ్యమే కాదు, మానసిక ప్రశాంతత కోసం కూడా చాలామంది పాశ్చాత్య ప్రముఖులు యోగ సాధన సాగిస్తున్నారు. ప్రముఖ హాలీవుడ్ నటి, ఆస్కార్ అవార్డు గ్రహీత జూలియా రాబర్ట్స్ కొన్నేళ్లుగా యోగ సాధన చేస్తున్నారు.

యోగా వల్ల తన శరీరం అదుపులో ఉంటోందని, మానసికంగానూ ప్రశాంతంగా ఉండగలుగుతున్నానని ఆమె చెబుతున్నారు. హాలీవుడ్ ట్రెండ్‌కు భిన్నంగా బోటాక్స్ వంటి సౌందర్య చికిత్సలేవీ లేకుండానే జూలియా రాబర్ట్స్ తన అందచందాలను, ఆరోగ్యాన్ని కాపాడు కోగలుగుతున్నారంటే అందుకు యోగాసనాలే కారణం.
 

Advertisement
 
Advertisement
Advertisement