ఆరోగ్యకరమైన బరువుకు సూచిక  బీఎంఐ కాదు..!

Healthy weight indicator is not BMI - Sakshi

ఊబకాయం ఉంటే బోలెడన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయని మనం వినే ఉంటాం. చాలా ఆరోగ్య సమస్యలకు చికిత్స ‘తగినంత’ కంటే ఎక్కువ బరువు ఉండటమేనని అనడమూ కద్దు. అందుకే దాదాపు వందేళ్లుగా బాడీ మాస్‌ ఇండెక్స్‌ (బీఎంఐ) అనే లెక్కకు ప్రాధాన్యం ఏర్పడింది. అయితే తాజా పరిశోధనలు మాత్రం ఆరోగ్యకరమైన బరువు ఎంత అనేందుకు బీఎంఐ ఒక్కటే సూచిక కాదని అంటోంది. శరీరం బరువుకు, ఎత్తుకు మధ్య ఉన్న సంబంధాన్ని చూపే  బీఎంఐ చాలా ఎక్కువన్నప్పటికీ పదిశాతం కంటే తక్కువ కొవ్వు ఉండేవాళ్లు మనచుట్టూ ఎందరో ఉన్నారు. అంతేకాదు.. ఊబకాయంతో ఉన్న వారందరికీ 
మధుమేహం, గుండెజబ్బుల్లాంటివి వచ్చే అవకాశాలు లేవని కూడా ఇప్పటికే చాలా అధ్యయనాలు స్పష్టం చేశాయి.

ఈ నేపథ్యంలో బరువుతో సంబంధం లేకుండా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎవరికి ఉన్నాయో తెలుసుకునేందుకు చుక్క రక్తం ఉపయోగపడుతుందని అంటున్నారు శాస్త్రవేత్తలు. రక్తంలోని జీవక్రియలకు ఉపయోగపడే అనేకానేక రసాయనాల మోతాదులను గుర్తించడం ద్వారా గుండెజబ్బులు, మధుమేహం, మూత్రపిండాల సమస్యలను 80 – 90 శాతం కచ్చితత్వంతో గుర్తించవచ్చునని వీరి అంచనా. కొన్ని వేల మందిని పరిశీలించిన తరువాత తామీ అంచనాకు వచ్చినట్లు సెల్‌ ప్రెస్‌ శాస్త్రవేత్తలు తెలిపారు 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top