రోజుకు అరగంట వ్యాయామం మేలు!

Half an hour workout is good - Sakshi

రోజూ వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి మంచిది. బాగానే ఉందిగాని.. ఎన్ని గంటలు చేయాలి? ఆసక్తికరమైన ఈ ప్రశ్నకే సమాధానం కనుక్కునేందుకు అమెరికా సంస్థ ఒక అధ్యయనం చేసింది. దీని ప్రకారం.. 18 – 64 ఏళ్ల మధ్య వయస్కులు వారానికి కనీసం 150 నిమిషాల పాటు ఓ మోస్తరు తీవ్రత ఉండే గుండె సంబంధిత వ్యాయామాలు చేస్తే పూర్తిస్థాయి ఫలితాలు అందుకోవచ్చునని తేల్చింది. వైద్య పరమైన సమస్యలేని వారికి ఈ మాత్రం వ్యాయామం సరిపోతుందని, ఇందులో సగం కాలం అంటే వారానికి 75 నిమిషాలపాటు కొంచెం శ్రమతో కూడిన వ్యాయామం చేసినా ఓకే అని ఆ సంస్థ చెబుతోంది.
 

ఓ మోస్తరు వ్యాయామం జాబితాలో వేగంగా నడవడం, ఎత్తుపల్లాలు పెద్దగా లేని చోట సైక్లింగ్, ఇంకొకరితో కలిసి టెన్నిస్‌ ఆడటం వంటివి ఉంటే.. శ్రమతో కూడిన వ్యాయామం జాబితాలో జాగింగ్, పరుగులు, ఈత, ఎత్తుపల్లాలను అధిగమిస్తూ సైక్లింగ్‌ చేయడం, బాస్కెట్‌ బాల్, సింగిల్‌గా టెన్నిస్‌ ఆడటం వంటివి ఉన్నాయి. వీటితోపాటు శక్తిని పెంచే వ్యాయామాలు ఒకటిరెండు చేయాల్సి ఉంటుంది. అరవై ఏళ్లు పైబడినవారు మరింత ఎక్కువకాలం ఎక్సర్‌సైజులు చేయడం మేలని సూచిస్తున్నారు. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top