షారుఖ్ ఏం చేశాడు క్యాట్?! | Gossip | Sakshi
Sakshi News home page

షారుఖ్ ఏం చేశాడు క్యాట్?!

May 9 2015 11:14 PM | Updated on Apr 3 2019 6:23 PM

షారుఖ్  ఏం చేశాడు క్యాట్?! - Sakshi

షారుఖ్ ఏం చేశాడు క్యాట్?!

బాలీవుడ్ ప్రపంచంలోకి సునామీలా దూసుకొచ్చి, కన్నుమూసి తెరిచేలోగా టాప్ హీరోయిన్ అయిపోయిన కత్రినా...

గాసిప్
 
బాలీవుడ్ ప్రపంచంలోకి సునామీలా దూసుకొచ్చి, కన్నుమూసి తెరిచేలోగా టాప్ హీరోయిన్ అయిపోయిన కత్రినా... అంతే వేగంగా వివాదాలలోనూ చిక్కుకుంది. సల్మాన్‌తో చెట్టాపట్టాలు, రణబీర్‌తో రహస్య ప్రేమతో వార్తల్లోకి ఎక్కింది. ఇప్పుడు తాజాగా ఓ స్టార్ హీరోతో చేయడానికి నో చెప్పి మరోసారి న్యూస్‌లో నిలిచింది.

నిన్నటివరకూ షారుఖ్ నటిస్తోన్న ఓ చిత్రంలో కత్రినా ఐటెమ్ సాంగ్ చేయబోతోందన్న వార్త హల్‌చల్ చేసింది. అయితే అలాంటిదేమీ లేదని, అది వట్టి పుకారని, కత్రినా చాలా బిజీగా ఉన్నందున ఐటెమ్ సాంగులు చేయబోదని మేనేజర్ ఇవాళ కుండ బద్దలు కొట్టేశాడు. అయితే బిజీగా ఉండటం వల్ల కాదని, నిజానికి కత్రినా షారుఖ్‌తో చేయడానికి ఇష్టపడలేదని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అంతగా వారిద్దరి మధ్య శత్రుత్వం ఏముందా అని కొందరు కూపీలు లాగే పనిలో కూడా పడ్డారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement