నేనొక ప్రేమ పిపాసిని... | Glamour point | Sakshi
Sakshi News home page

నేనొక ప్రేమ పిపాసిని...

Mar 11 2015 2:51 AM | Updated on Sep 2 2017 10:36 PM

నేనొక ప్రేమ పిపాసిని...

నేనొక ప్రేమ పిపాసిని...

‘ఇదీ ప్రేమ’ అని చెప్పడానికి ప్రత్యేక కొలమానాలు ఏవీ లేవు.

గ్లామర్ పాయింట్

 ‘మీరెప్పుడైనా ప్రేమలో పడ్డారా?’ అని ఎవరైనా అడిగితే-
 ‘కొత్తగా పడడం ఏమిటి? ప్రేమలోనే ఉన్నాను’ అంటాను.
 ‘పేరు చెప్పండి?’ అంటారు ఆసక్తిగా. ‘అమ్మానాన్నా’ అంటాను!
 ‘ఇదీ ప్రేమ’ అని చెప్పడానికి ప్రత్యేక కొలమానాలు ఏవీ లేవు. నిజానికి నాకు ‘ప్రేమ’ అంటే ఏమిటో బొత్తిగా తెలియదు. కానీ ఆ మాటను ప్రేమిస్తాను. తెలియకపోయినా దాని గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను.

ప్రేమ అనేది స్వేచ్ఛా ప్రవాహంలాంటిది. అది మనల్ని ఒక స్వతంత్ర స్థితికి తీసుకువెళుతుంది. సానుకూలశక్తిని పెంపొందిస్తుంది. ప్రేమ... ప్రతి తరానికి కొత్తగానే ఉంటుంది. ప్రస్తుతం మాత్రం నేను తల్లిదండ్రుల ప్రేమలో ఉన్నాను. అది షరతులు లేని ప్రేమ. అన్ని ప్రేమల్లోకెల్లా గొప్ప ప్రేమ!
 
- శ్రద్ధా కపూర్
 

Advertisement
 
Advertisement
Advertisement