కుచ్చు కుచ్చు హోతా హై!

The girls are like a toy basket and the princess is shining - Sakshi

ఫ్యాషన్‌

కుచ్చులమ్మ కుచ్చులు మా ఊరు వచ్చాయి కుచ్చులు పెళ్ళి వారందరికీ నచ్చునండీ నచ్చును.వచ్చునండి వచ్చును అమ్మాయిలందరికీ కళ వచ్చును.నీజమే మరి, ఇది కుచ్చుల సీజన్‌కుచ్చు కుచ్చు హోతాహై! 

పెళ్ళి అంటేనే అందమంతా ఒక చోట రాసులుగా పోసిన కళతో ఉట్టిపడుతుంటుంది. అలాంటి చోట అమ్మాయిలంతా బుట్ట బొమ్మల్లా, యువరాణుల్లా మెరిసిపోతూ ఉంటారు. ‘ఎప్పుడూ వేసినట్టే పట్టు లంగా ఓణీ, చీరకట్టు అంతేనా, ఇంకేమీ స్పెషల్‌ లేదా..’ అనుకునే అమ్మాయిలు ఈ కొత్త  రఫెల్‌ స్టైల్‌తో మెరిసిపోవచ్చు. లెహంగా, చోళీ కాన్సెప్ట్‌ పాతదే అయినా దీనికే కుచ్చులున్న దుపట్టాను జత చేసి చూడండి. మేని కళలో వచ్చిన తేడా మీకే తెలిసిపోతుంది.

►డిజైనర్‌ ష్రగ్‌ స్టైల్‌ చోలీ లెహెంగాకు జతగా కుచ్చుల నెటెడ్‌ దుపట్టా తోడైతే వేదిక ఏదైనా గ్రాండ్‌గా వెలిగిపోవచ్చు. 

►షిమ్మర్‌  చోలీ, లెహెంగా డ్రెస్‌ ఏ వేడుకనైనా కాంతిమంతం చేస్తుంది. దానికి నెటెడ్‌ కుచ్చుల దుపట్టా జత చేర్చితే వేడుక కళ వెయ్యింతలు అవుతుంది.

►ప్లెయిన్‌ కలర్‌ లెహంగాని మరింత అందంగా చూపించేలా రఫెల్‌ దుపట్టా తోడైతే వేడుకలో బటర్‌ఫ్లైలా వెలిగిపోవచ్చు. 

►రాసిల్క్‌ లెహంగాకి షిమ్మర్, పువ్వుల చోలీ ఆకర్షణ పెంచితే నెటెడ్‌ కుచ్చుల దుపట్టా రాణీ కళకు ఆహ్వానంపలుకుతుంది.

►రాసిల్క్‌ లెహంగాకి షిమ్మర్, పువ్వుల చోలీ ఆకర్షణ పెంచితే నెటెడ్‌ కుచ్చుల దుపట్టా రాణీ కళకు ఆహ్వానంపలుకుతుంది.

►దండలా కుచ్చిన దుపట్టా, దానికి జత చేసిన లేస్, కుచ్చుల లెహెంగా డ్రెస్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చింది.

►లెహెంగా చోలీ దుపట్టా.. ఒకే రంగులో ఉన్నా కుచ్చులు జత చేరితే వచ్చే కళే వేరు. పెళ్లింట అది రెట్టింపు వెలుగై వేడుకలో కనువిందు చేస్తుంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top