రుచుల్లో ఐదో ప్రధానమైనది... ‘ఊమమీ’! | Flavors is the fifth ... 'umami'! | Sakshi
Sakshi News home page

రుచుల్లో ఐదో ప్రధానమైనది... ‘ఊమమీ’!

Sep 29 2015 10:57 PM | Updated on Sep 3 2017 10:11 AM

రుచుల్లో  ఐదో ప్రధానమైనది... ‘ఊమమీ’!

రుచుల్లో ఐదో ప్రధానమైనది... ‘ఊమమీ’!

ఎరుపు, ఆకుపచ్చ, పసుపు అనే ముడు ప్రధాన రంగుల నుంచే అనేక వర్ణాల షేడ్స్ ఆవిర్భవించినట్లే... నాలుగు ప్రధాన రుచులు నుంచే

మెడి క్షనరీ

 ఎరుపు, ఆకుపచ్చ, పసుపు అనే ముడు ప్రధాన రంగుల నుంచే అనేక వర్ణాల షేడ్స్ ఆవిర్భవించినట్లే... నాలుగు ప్రధాన రుచులు నుంచే నాలుకకు అనేక ఫ్లేవర్స్ తెలుస్తుంటాయి. ఇందులో ప్రధానమైన  మొదటి నాలుగు రుచులు... తీపి, పులుపు, చేదు, ఉప్పు. దీనికి తోడు మరో ప్రధాన రుచి ఉందని జపాన్ శాస్త్రవేత్తలు కొనుగొన్నారు. ఈ ఐదో ప్రధాన రుచిని వారు 1908లో తెలుసుకున్నారు. మనం చికెన్, వేటమాంసం, చేపలు, చీజ్ తిన్నప్పుడు నాలుకకు చాలా రుచికరంగా అనిపిస్తుంది.

అలా అనిపించడం అనే అనుభూతిని కలిగించే రుచి ఉప్పుదే. ఆయా పదార్థాల్లో ఉండే మోనోసోడియమ్ గ్లుటామేట్ అనే అమైనోయాసిడ్ వల్ల స్వాభావికమైన ఈ రుచి తెలుస్తుంది. ఏదైనా కాయ పండిన కొద్దీ రుచి పెరగడం అనేది ఈ గ్లుటామేట్ అనే పదార్థం వల్లనే జరుగుతుంటుంది. చైనా ఉప్పు వాడటం వల్ల వంటకాలకు, ఆహార పదార్థాలకు ‘ఊమమీ’ రుచి వస్తుంటుంది.
 
 

Advertisement
 
Advertisement
Advertisement