breaking news
Scientists in Japan
-
గ్రీన్ టీతో గుండెకు మేలు
పరిపరి శోధన గ్రీన్ టీ తాగితే గుండెకు మేలు కలుగుతుందని జపాన్ శాస్త్రవేత్తలు ఇటీవల నిర్వహించిన తాజా పరిశోధనలో తేలింది. గ్రీన్ టీలో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల గుండెపోటు కారణంగా సంభవించే అకాల మరణాలను తప్పించుకోవచ్చని వారు చెబుతున్నారు. రోజుకు కనీసం ఐదు కప్పులకు పైగా గ్రీన్ టీ తాగేవారికి గుండెపోటు వచ్చే అవకాశాలు 10 శాతం మేరకు తగ్గుతాయని, అంతే కాకుండా అధిక రక్తపోటు కూడా గణనీయంగా అదుపులోకి వస్తుందని వారు చెబుతున్నారు. జపాన్లో 40-69 ఏళ్ల మధ్య వయసు గల 90 వేల మందిపై విస్తృతంగా నిర్వహించిన పరిశోధనల్లో ఈ అంశం వెలుగులోకి వచ్చిందని అంటున్నారు. -
రుచుల్లో ఐదో ప్రధానమైనది... ‘ఊమమీ’!
మెడి క్షనరీ ఎరుపు, ఆకుపచ్చ, పసుపు అనే ముడు ప్రధాన రంగుల నుంచే అనేక వర్ణాల షేడ్స్ ఆవిర్భవించినట్లే... నాలుగు ప్రధాన రుచులు నుంచే నాలుకకు అనేక ఫ్లేవర్స్ తెలుస్తుంటాయి. ఇందులో ప్రధానమైన మొదటి నాలుగు రుచులు... తీపి, పులుపు, చేదు, ఉప్పు. దీనికి తోడు మరో ప్రధాన రుచి ఉందని జపాన్ శాస్త్రవేత్తలు కొనుగొన్నారు. ఈ ఐదో ప్రధాన రుచిని వారు 1908లో తెలుసుకున్నారు. మనం చికెన్, వేటమాంసం, చేపలు, చీజ్ తిన్నప్పుడు నాలుకకు చాలా రుచికరంగా అనిపిస్తుంది. అలా అనిపించడం అనే అనుభూతిని కలిగించే రుచి ఉప్పుదే. ఆయా పదార్థాల్లో ఉండే మోనోసోడియమ్ గ్లుటామేట్ అనే అమైనోయాసిడ్ వల్ల స్వాభావికమైన ఈ రుచి తెలుస్తుంది. ఏదైనా కాయ పండిన కొద్దీ రుచి పెరగడం అనేది ఈ గ్లుటామేట్ అనే పదార్థం వల్లనే జరుగుతుంటుంది. చైనా ఉప్పు వాడటం వల్ల వంటకాలకు, ఆహార పదార్థాలకు ‘ఊమమీ’ రుచి వస్తుంటుంది.