గ్రీన్ టీతో గుండెకు మేలు | Sakshi
Sakshi News home page

గ్రీన్ టీతో గుండెకు మేలు

Published Thu, Feb 25 2016 11:21 PM

గ్రీన్ టీతో గుండెకు మేలు

పరిపరి  శోధన
 
గ్రీన్ టీ తాగితే గుండెకు మేలు కలుగుతుందని జపాన్ శాస్త్రవేత్తలు ఇటీవల నిర్వహించిన తాజా పరిశోధనలో తేలింది. గ్రీన్ టీలో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల గుండెపోటు కారణంగా సంభవించే అకాల మరణాలను తప్పించుకోవచ్చని వారు చెబుతున్నారు.

రోజుకు కనీసం ఐదు కప్పులకు పైగా గ్రీన్ టీ తాగేవారికి గుండెపోటు వచ్చే అవకాశాలు 10 శాతం మేరకు తగ్గుతాయని, అంతే కాకుండా అధిక రక్తపోటు కూడా గణనీయంగా అదుపులోకి వస్తుందని వారు చెబుతున్నారు. జపాన్‌లో 40-69 ఏళ్ల మధ్య వయసు గల 90 వేల మందిపై విస్తృతంగా నిర్వహించిన పరిశోధనల్లో ఈ అంశం వెలుగులోకి వచ్చిందని అంటున్నారు.
 

Advertisement
Advertisement