ఇలా చేస్తే పెదవుల చర్మం పొట్టు రాలదు

At first glance the result of the change in the atmosphere is lip - Sakshi

బ్యూటిప్స్‌

మృదువైన పెదవుల కోసం వాతావరణంలో వచ్చిన మార్పు ఫలితానికి మొదట దర్పణంగా నిలిచేది పెదవులే. వేడికాని చలి కాని శరీరం మీద ప్రభావం చూపించి అది బయటకు కనిపించే లోపుగా మొదటి హెచ్చరికను జారీ చేస్తాయి పెదవులు. పొడిబారి, చర్మం పొట్టులా రాలుతుంటే ఇంట్లోనే చేసుకునే ఈ చిన్న ట్రీట్‌మెంట్‌లు పెద్ద ఫలితాన్నిస్తాయి.పెదవులు పొడిబారి చర్మం రాలుతుంటే రాత్రి పడుకునే ముందు ఒక స్పూన్‌ పాల మీగడలో రెండు చుక్కల పన్నీరు, రెండుచుక్కల నిమ్మరసం కలిపి బాగా రంగరించి పెదవులకు రాయాలి. ఇలా క్రమం తప్పకుండా ప్రతిరోజూ రాస్తుంటే వారం రోజుల్లోనే మంచి ఫలితం ఉంటుంది.

రెండు చుక్కల తేనె తీసుకుని పెదవుల మీద రాసి కొద్దిసెకన్లపాటు అలాగే ఉంచాలి. తేనె మీద పెట్రోలియం జెల్లీని సున్నితంగా రాయాలి. ఇప్పుడు పెదవుల మీద ఒక వరుస తేనె, దాని మీద పెట్రోలియం జెల్లీ ఉంటుంది. ఇప్పుడు పది లేదా పదిహేను నిమిషాలపాటు అలాగే ఉంచాలి. చివరగా వేడినీటితో పెదవులను శుభ్రం చేయాలి. ఇలా ఐదురోజుల పాటు ప్రతిరోజూ క్రమం తప్పకుండా చేస్తుంటే పెదవుల మీద చర్మం ఎండిపోయి పొరలుగా లేవడం జరగదు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top