ఒత్తిడి.. స్ట్రెస్.. ఆందోళన.. మనిషి జీవితంలో సహజం. పాఠశాల విద్యార్థి మొదలుకుని.. గృహిణులు, కళాశాల విద్యార్థులు, ఉద్యోగస్థులు, వ్యాపార రంగంలో ఉన్నవారు ఇలా ప్రతి ఒక్కరూ.. ఏదో ఒక విధంగా ఒత్తిడికి గురవుతున్నారు. దీనివల్ల అనుకున్న పనులు సకాలంలో పూర్తి కావడం లేదు. అంతేకాకుండా అనారోగ్యం బారినా పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఒత్తిడికి కారణాలు.. నివారణ మార్గాలు మీ కోసం..
మానవుడు.. నిద్రలేవడం నుంచి నిద్రపోయే వరకూ ఏదో ఒక మానసిక సంఘర్షణతో సతమతమవుతూ అందమైన జీవితాన్ని అంధకారంగా మార్చుకుంటున్నాడు. జీవితంలో కావాల్సిన అవసరాలకు అనుగుణంగా చక్కని ప్రణాళిక లోపించినప్పుడు మనిషి ఒత్తిడికి గురవుతాడు. దీంతో శారీరక, మానసిక రుగ్మతలకు లోనవడంతోపాటు, సామాజికంగా, ఆర్థికంగా బలహీనుడవుతాడు. ఒత్తిడిని.. విజయానికి నాందిగా మార్చుకుంటే మనిషి ఒత్తిడిని జయించడమే కాకుండా విజయతీరాలకు చేరుకుంటాడు. ముఖ్యంగా ప్రాథమిక దశలోనే ఒత్తిడికి గల కారణాలపై దృష్టి పెట్టాలి. ఆ తర్వాత ఒత్తిడికి కారణమయ్యే ప్రతి ఒక్క అంశాన్ని నిర్మూలించాలి. అయితే చాలామంది ఒత్తిడి నుంచి బయటపడడానికి మార్గాలను అన్వేషించరు. ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి సిగరెట్, మద్యపానం, మాదక ద్రవ్యాల అలవాట్లతో పెడదారులను ఎంచుకుంటారు. దీనివల్ల ఒత్తిడి నుంచి తప్పించుకోలేకపోవడంతోపాటు ఆరోగ్యం తీవ్ర దుష్ర్పభావాలకు లోనవుతుంది. కుటుంబంపై కూడా దీని ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఎవరికీ మనశ్శాంతి అనేది లేకుండా పోతుంది. కాబట్టి ఒత్తిడికి కారణాలు, వాటిని జయించడానికి ఎంచుకోవాల్సిన మార్గాలు ఒకసారి పరిశీలిద్దాం.
అందరికీ పని ఒత్తిడి!
ఒక గృహిణి తన రోజువారీ వంట చేయడం నుంచి పిల్లల సంరక్షణ, ఆరోగ్యం, బట్టలు ఉతకడం, కూరగాయలు తరుక్కోవడం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఏదో ఒక విషయమై ఒత్తిడికి గురవుతుంటుంది. పాఠశాల, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు వారి హాజరు, పరీక్షలు, అసైన్మెంట్స్, ప్రాజెక్ట్ వర్క్ వంటి విషయాల్లో ఒత్తిడికి లోనవుతారు. అలాగే ఆఫీసుకు సరైన సమయంలో వెళతామో, లేదో అని ఉద్యోగులపై ఒత్తిడి ఉంటుంది. ఆఫీసుకు వెళ్లిన తర్వాత అప్పగించిన పనిని సకాలంలో పూర్తిచేయడం, సహోద్యోగులతో సమన్వయం వంటి విషయాల్లోనూ ఒత్తిడి సహజం. వ్యాపారం చేసే వారిలో ఈ సమస్య ఇంకా ఎక్కువ ఉంటుంది. వ్యాపార విషయాల్లో వ్యక్తి 24 గంటలూ (ఒక్క నిద్రపోయేటప్పుడు మినహా) ఆలోచిస్తూ ఉంటాడని ‘కాలిఫోర్నియా యూనివర్సిటీ’ చేసిన అధ్యయనంలో తేలింది. కాబట్టి ఒక గృహిణి, ఒక విద్యార్థి, ఒక ఉద్యోగస్థుడు, ఒక వ్యాపారి.. ఇలా ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో ప్రతిరోజూ, ఏదో ఒక స్థితిలో ఒత్తిడికి లోనవుతూనే ఉంటారు.
ఒత్తిడిని ఇలా ఎదుర్కోండి:
ఒత్తిడిని జయించడంలో భాగంగా ప్రతి ఒక్కరూ కొన్ని పద్ధతులను పాటించాలి. దీని ద్వారా ఒత్తిడిని సులువుగా ఎదుర్కోవచ్చు. కాలం అనేది ఒక నిరంతర ప్రక్రియ. ఈ రోజు రేపు రాదు. ఓ కవి చెప్పినట్లుగా పెరుగుతుంది వయసు అని అనుకుంటారు కానీ తరుగుతుంది ఆయువు అని తెలుసుకోరు. కాలానికి ఎవరైతే విలువనిస్తారో వారు కాలానుగుణంగా ఎదుగుతారు. సమయపాలన ప్రాధాన్యతా క్రమం, పనిపై అకుంఠిత దీక్ష, వ్యాయామం, ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక ప్రణాళిక; పిల్లలతో, పెద్దలతో ప్రేమతో నిజాయతీగా వ్యవహరించడం, డైరీ రాయడం, రోడ్ మ్యాప్ రూపొందించుకోవడం వంటి వాటి ద్వారా ఒత్తిడి మీ దరి చేరదు. దీనివల్ల మీరు ఎంతో ఆర్యోగంగా, ఉత్సాహంగా ఉంటారు.
సమయపాలన:
ప్రపంచం మొత్తానికీ అందుబాటులో ఉన్న సమయం 24 గంటలే. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ఒత్తిడిని చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఒక పాఠశాలలో, కళాశాలలో చదివే విద్యార్థికి వారి టైమ్‌టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. విద్యార్థి ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజు పాఠశాల/కళాశాలలో బోధించిన అంశాలను అధ్యయనం, లోతైన విశ్లేషణ చేయడం ద్వారా విద్యార్థికి ఆత్మస్థైర్యం, ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. టైమ్ టేబుల్లో ప్రతిరోజూ ప్రాధాన్యతా క్రమానికి పెద్దపీట వేయండి. రోజూ భోజనం, నిద్రతోపాటు స్టడీకి చక్కని ప్రణాళిక రూపొందించుకోండి. ప్రయోజనం లేని పనులకు ప్రాధాన్యత ఇవ్వకండి,
ప్రాధాన్యతాక్రమం:
విద్యార్థులు.. తమకు ఏ సబ్జెక్టుల్లో అసాధారణమైన పట్టు ఉందో, వేటిలో బలహీనంగా ఉన్నారో తెలుసుకోవాలి. దీని ఆధారంగా ప్రాధాన్యతాక్రమాన్ని రూపొందించుకోవాలి. సాధారణంగా ఒక వ్యక్తి తన పనులను ఒకచోట రాసుకొని వాటిలో ఏది అతి ముఖ్యం, ముఖ్యం, చివరి ప్రాముఖ్యత.. ఇలా ప్రాధాన్యతల వారీగా పూర్తి చేసుకోవాలి. ఒక ఉదాహరణను పరిశీలిద్దాం. అద్దె కట్టడం - సరుకులు తీసుకోవడం - దుస్తులు కొనడం - రైల్వే రిజర్వేషన్ చేయించడం - ఇవి ఆ రోజుకు పనులుగా రాసుకుంటే...
1. రైల్వే రిజర్వేషన్ చేయించడం (ఒకవేళ మనం తొందరగా చేయకపోతే వెయిటింగ్ లిస్ట్ పెరిగిపోవచ్చు) 2. కరెంట్ బిల్ కట్టడం (కట్టకపోతే పెనాల్టీ పడొచ్చు)
3. సరుకులు తీసుకురావడం,
4. దుస్తులు కొనడం. ఈ ప్రాధాన్యతల్లో చిట్టచివరిది దుస్తులు కొనడం అంత ప్రాధాన్యమైన విషయం కాదు. ఎందుకంటే మొదటి రెండు అంశాలు సమయానికి ముడిపడి ఉన్నాయి. కాబట్టి ప్రతిరోజూ ఒక పుస్తకంలో మనం చేయాల్సిన పనులను, వాటి ప్రాధాన్యతలను రాసుకోవాలి. ప్రాధాన్యతలో భాగం రోజువారీ, నెలవారీ, ఆరునెలల వారీగా టాస్క్‌లను రాసుకోవడం వల్ల పనులన్నీ సజావుగా సాగిపోతాయి.
ఒత్తిడిని చిత్తు చేయండిలా
Published Sun, Mar 16 2014 11:42 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్‌పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్‌లు ఔట్! వీడియో
ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్‌పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్‌లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement