కామెడీయే కలిసొస్తున్నట్టుంది! | do u know nahasharma? | Sakshi
Sakshi News home page

కామెడీయే కలిసొస్తున్నట్టుంది!

May 25 2015 1:03 AM | Updated on Sep 3 2017 2:37 AM

కామెడీయే కలిసొస్తున్నట్టుంది!

కామెడీయే కలిసొస్తున్నట్టుంది!

నేహాశర్మ గుర్తుందా? ‘చిరుత’ సినిమాలో ‘ఏయ్ బాబూ... ఇలా రామ్మా’ అంటూ...

గాసిప్
నేహాశర్మ గుర్తుందా? ‘చిరుత’ సినిమాలో ‘ఏయ్ బాబూ... ఇలా రామ్మా’ అంటూ రామ్‌చరణ్ దగ్గర అహంకారాన్ని ప్రదర్శించే అమ్మాయిగా నటించింది. ఆ తర్వాత కూడా ఒకట్రెండు తెలుగు సినిమాలు చేసినా... అవి విజయం సాధించకపోవడంతో మెరుపులా మాయమైంది నేహా. ఏమయ్యిందబ్బా అని అందరూ అనుకుంటుండగానే బాలీవుడ్‌లో తేలింది. క్రూక్, తేరీ మేరీ కహానీ, యంగిస్తాన్ వంటి సినిమాల్లో అప్పుడప్పుడూ కనిపించింది కానీ పాపం కెరీర్ అనుకున్నంతగా లేదనే చెప్పాలి.

ఇటీవలే ఆమెకి ‘హేరా ఫేరీ’ సినిమా మూడో భాగంలో నటించే చాన్స్ వచ్చింది. ఓకే అయితే చెప్పింది కానీ కామెడీ సినిమా కాబట్టి కాస్త లోలోపల ఫీలవుతోందని సమాచారం. ఇంతకు ముందు కూడా క్యా సూపర్ కూల్ హై హమ్, జయంతిభాయ్‌కీ లవ్‌స్టోరీ, యమ్లా పగ్లా దివానా 2 వంటి కామెడీ చిత్రాల్లో నటించింది. ఇప్పుడూ అలాంటి సినిమాయే రావడంతో ‘కామెడీయే కలిసొస్తున్నట్టుంది’ అంటూ కొన్ని ముంబై పత్రికలు రాసి పారేశాయ్. దాంతో నేహ కాస్త నొచ్చుకుందని వినికిడి!

Advertisement
 
Advertisement
Advertisement