ఎడారుల్లో కల్పవృక్షం | Sakshi
Sakshi News home page

ఎడారుల్లో కల్పవృక్షం

Published Sun, Jun 5 2016 11:58 PM

ఎడారుల్లో కల్పవృక్షం

తిండి గోల
ఎప్పుడు ఎక్కడ ఎలా పుట్టిందో ఇతమిత్థంగా తెలియదు కానీ, ప్రాచీన కాలం నుంచే ఖర్జూర పండ్లను ఆహారంగా వినియోగిస్తున్నాం. రంగు, రుచి, ఆకారాలని బట్టి వీటిలో చాలా రకాలున్నాయి. కొలరాడో నదీతీరాన ముదురు రంగులో, నున్నగా ఉండే మెడ్‌జూల్ రకానికి చెందిన డేట్స్‌కి కింగ్ ఆఫ్ డేట్స్ అని పేరు. తరువాతి స్థానం గుండ్రంగా, మృదువుగా, తియ్యగా ఉండే బార్హీ రకానిది. దీన్ని హనీబాల్ అంటారు.

ఇంకా అచ్చం తేనెలా ఉండే హనీ, నలుపు రంగులో నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉండే బ్లాక్ డేట్స్, బంగారు రంగులో ఉండే గోల్డెన్ ప్రిన్సెస్... ఇలా ఎన్నో రకాలున్నాయి. వేసవిలో ఎండు ఖర్జూరం వేసిన నీళ్లు తాగిస్తే పిల్లలకు మంచిది. స్వీట్లు, పుడ్డింగులు, కేకులు, డెజర్టుల తయారీలో ఖర్జూరం ఉండి తీరాల్సిందే. రమ్‌జాన్ ఉపవాస దీక్ష విరమణకు ముస్లిమ్‌లు ఖర్జూరానికే ప్రాధాన్యత ఇస్తారు.

Advertisement
 
Advertisement
 
Advertisement