దంతవీరుడు | Dental Hero | Sakshi
Sakshi News home page

దంతవీరుడు

Dec 5 2015 12:11 AM | Updated on Aug 21 2018 2:34 PM

దంతవీరుడు - Sakshi

దంతవీరుడు

పంటిబిగువున కష్టాలను భరించామంటుంటారు చాలామంది కానీ, పళ్లతో బరువులెత్తే సాహసానికి ఒడిగట్టగలరా? బతికుంటే బలుసాకు తినొచ్చు..

తిక్కలెక్క
 
పంటిబిగువున కష్టాలను భరించామంటుంటారు చాలామంది కానీ, పళ్లతో బరువులెత్తే సాహసానికి ఒడిగట్టగలరా? బతికుంటే బలుసాకు తినొచ్చు... బరువులెత్తి పళ్లూడగొట్టుకోలేమనుకుంటున్నారా..? లగ్జెంబర్గ్ దంతవీరుడు జార్జెస్ క్రిస్టెన్ మాత్రం అలా కాదు. ఎంతటి బరువునైనా సునాయాసంగా పళ్లతోనే పైకి లేపేయడానికి సై అంటాడు.

అనడమే కాదు, స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో తన దంతదారుఢ్యాన్ని ప్రత్యక్షంగా ప్రదర్శించి, వీక్షకులను నోరెళ్లబెట్టేలా చేశాడు. పన్నెండు కిలోల టేబుల్‌పై దాదాపు యాభై కిలోల బరువున్న సుందరాంగిని కూర్చోబెట్టి, పళ్లతోనే ఆ బరువును పైకి లేపాడు. పంటి బిగువున పైకి లేపిన టేబుల్, దాని మీద కూర్చున్న యువతి కింద పడకుండా 11.80 మీటర్లు సునాయాసంగా నడిచి, గిన్నెస్ బుక్‌లోకి ఎక్కాడు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement