గ్రాండ్‌ క్రిస్మస్‌ | The Christmas style of Christmas is the priority of the New Years Eve | Sakshi
Sakshi News home page

గ్రాండ్‌ క్రిస్మస్‌

Dec 21 2018 2:23 AM | Updated on Dec 21 2018 2:23 AM

The Christmas style of Christmas is the priority of the New Years Eve - Sakshi

మహిళలు కీర్తించబడాలిసమాజంలో మహరాణుల్లా ఉండాలివిజయాల కిరీటాలు ధరించాలివారి చిరునవ్వు ధరిత్రికే వెలుగవ్వాలిమెర్రీ క్రిస్మస్‌ గ్రాండ్‌గా జరుపుకోవాలిబీ కాన్ఫిడెంట్‌..  బీ స్ట్రాంగ్‌..

క్రిస్మస్, న్యూ ఇయర్‌ వేడుకలలో సహజంగానే వెస్ట్రన్‌ స్టైల్‌ దుస్తులకు ప్రాధాన్యత ఉంటుంది. ఇండోవెస్ట్రన్‌ స్టైల్‌ ఇప్పుడు మన వేడుకలలో ప్రధానంగాకనిపిస్తున్న అట్రాక్టివ్‌ లుక్‌. అనార్కలీ, లాంగ్‌ గౌన్స్‌నినేటితరం ముచ్చటపడి ఎంచుకుంటున్న స్టైల్‌. వీటికి పొట్టి,పొడవాటి ఎంబ్రాయిడరీ ఓవర్‌కోట్లు మరింత వన్నెలుఅద్దుతున్నాయి. గౌన్‌కి కాంట్రాస్ట్‌ కలర్‌ బెనారస్, నెటెడ్‌ఫ్యాబ్రిక్స్‌తోనూ ఓవర్‌కోట్‌ని డిజైన్‌ చేసుకోవచ్చు. 
 

►పట్టుచీరతో డిజైన్‌ చేసిన లాంగ్‌ అనార్కలీ గౌన్‌. పల్లూ పార్ట్‌ని జాకెట్, స్లీవ్స్‌గా డిజైన్‌ మిగతా శారీని స్కర్ట్‌గా జత చేశారు. కాలర్‌నెక్‌ ఇవ్వడంతో లుక్‌ ఇండోవెస్ట్రన్‌ స్టైల్‌లో ఆకట్టుకుంటుంది.

►లాంగ్‌ మఖమల్‌ స్లీవ్‌లెస్‌ గౌన్‌ మీదకి ఎంబ్రాయిడరీ అంచులు జత చేసిన ఓవర్‌ కోట్‌  ధరిస్తే సంప్రదాయ వేడుకలకు సైతం సరికొత్త భాష్యం చెబుతుంది.

►నలుపురంగు లాంగ్‌ గౌన్‌కి లాంగ్‌ డిజైనర్‌ జాకెట్‌ వేడుకలో గ్రాండ్‌గా నిలుస్తుంది. ఇతర అలంకరణలు ఏవీ లేకపోయినా పార్టీలో స్పెషల్‌ లుక్‌ని తీసుకువస్తుంది.

►లాంగ్‌ ప్రింటెడ్‌ మ్యాక్సీ గౌన్‌కి పొడవాటి చేతులున్న పువ్వుల ఎంబ్రాయిడరీ జాకెట్‌ వేడుకకు మోడ్రన్‌ లుక్‌ తీసుకువచ్చింది.

►ఫ్లోర్‌లెంగ్త్‌ లాంగ్‌ గౌన్‌కి పూర్తి కాంట్రాస్ట్‌ కలర్‌ లాంగ్‌ జాకెట్‌ సరైన ఎంపిక. ఈ బ్రైట్‌ కాంబినేషన్‌  క్రిస్మస్, న్యూ ఇయర్‌ పార్టీలకు పర్‌ఫెక్ట్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement