జీవితపు రుచి

catastrophic situation of survival - Sakshi

చెట్టు నీడ 

ప్రాణాలు పోయేంతటి విపత్కర  పరిస్థితిలో కూడా జీవితాన్ని రుచికరంగా  మలుచుకోగలిగే వెసులుబాటు ఉంది. కానీ నిజంగా ఆలోచిస్తే, మనకు ప్రాణాలు  పోయేంత సందర్భాలు ఉంటాయా?

ఒకాయన ఒక మూలిక కోసం దట్టమైన అరణ్యానికి వెళ్లాడు. వెతుకుతూ నడుస్తుండగా– ఉన్నట్టుండి, వెనక నుంచి పులి గాండ్రింపు వినబడింది. ప్రాణాలు కాపాడుకోవడానికి తోచినదిక్కు పరుగెత్తాడు. అలా ఒక కొండ మీదికి చేరుకున్నాడు. ఆ భయంలో అక్కడ పట్టుజారడంతో కొండ కొమ్ముకు వేలాడసాగాడు. తిరిగి పైకి ఎక్కడానికి వీలు లేదు. అక్కడ పులి ఉంటే! చూస్తే కొండలో మొలిచిన ఒక తీగేదో కనబడింది. దాన్ని పట్టుకుని కిందకు దిగాలన్న ఆలోచన వచ్చింది. నెమ్మదిగా తీగను అందుకున్నాడు. అలా గాల్లో వేలాడుతుండగా, హఠాత్తుగా కొండలో ఉన్న బొరియలోంచి వచ్చిన రెండు ఎలుకలు ఆ తీగను కొరకడం మొదలుపెట్టాయి. ఇప్పుడేం చేయాలి? అప్పుడు ఆయన ఆ తీగకు ఒక చిన్న పండు ఉందని గమనించాడు. అది ఎర్రగా గుండ్రంగా ఉండి, నోరూరిస్తోంది.  దాన్ని తెంపి నోట్లో వేసుకున్నాడు. అంతటి గొప్ప రుచి అతడు అంతకుముందెన్నడూ చూడలేదు.

ఇంతే కథ! ఆ బాటసారి ఆ తర్వాత ఏమయ్యాడు అన్నది మనకు చెప్పదు. కానీ ఈ చెప్పిన మేరలోనే ఎంత వెలుగు ప్రసరిస్తోంది! ప్రాణాలు పోయేంతటి విపత్కర పరిస్థితిలో కూడా జీవితాన్ని రుచికరంగా మలుచుకోగలిగే వెసులుబాటు ఉంది. కానీ నిజంగా ఆలోచిస్తే, మనకు ప్రాణాలు పోయేంత సందర్భాలు ఉంటాయా?  మరి ఎంతమేరకు జీవితాన్ని రుచికరంగా మలుచుకోగలుగుతున్నాం!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top