ఆ రోజుల్లోనే బాడీ పెయింటింగ్! | Body painting those days | Sakshi
Sakshi News home page

ఆ రోజుల్లోనే బాడీ పెయింటింగ్!

Jul 4 2015 11:06 PM | Updated on Apr 3 2019 5:44 PM

ఆ రోజుల్లోనే బాడీ పెయింటింగ్! - Sakshi

ఆ రోజుల్లోనే బాడీ పెయింటింగ్!

బాడీ పెయింటింగ్ అనేది నిన్నటి మొన్నటి విషయం కాదని, 49,000 సంవత్సరాల క్రితమే ఇది ఉనికిలో ఉందని అంటోంది ....

బాడీ పెయింటింగ్ అనేది నిన్నటి మొన్నటి విషయం కాదని, 49,000 సంవత్సరాల క్రితమే ఇది ఉనికిలో ఉందని అంటోంది యూనివర్సిటీ ఆఫ్  కొలరాడో పరిశోధక బృందం. దీనికి సంబంధించిన ఆధారాలను ఇటీవల దక్షిణ ఆఫ్రికాలోని సిబుడు గుహల్లో ఈ బృందం కనుగొంది. పాలు, జేగురుమన్ను కలిపి గోడలపై పెయింటింగ్‌లు వేసేవారు. ఇదే మిశ్రమంతో బాడీ పెయింటింగ్ కూడా వేసుకునేవారు. జేగురుమన్నుతో చిత్రాలు వేయడం గురించిన ఆధారాలను కనుగొనడం కొత్తేమీ కాకపోయినప్పటికీ  జేగురుమన్ను, పాల మిశ్రమాలతో వేసిన చిత్రాలను కనుగొనడం మాత్రం ఇదే తొలిసారి.

జేగురుమన్నును పాలతో మాత్రమే కాకుండా చెట్టు బంక, గుగ్గిలాలను కలిపి పెయింట్‌గా తయారుచేసేవారట. ఆరోజుల్లో దక్షిణ ఆఫ్రికా ఆదిమ తెగల్లో బాడీ పెయింటింగ్ అనేది బాగా వాడుకలో ఉండేదని యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో పరిశోధక బృందం చెబుతోంది. నమీబియాలో ఆదిమవాసులు ఇప్పటికీ జేగురురంగు మన్ను, వెన్న మిశ్రమంతో బాడీ పెయింట్ చేసుకుంటారు.
 

Advertisement
 
Advertisement
Advertisement