పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు | Birthday celebrated Celebrities | Sakshi
Sakshi News home page

పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

Jul 11 2015 11:25 PM | Updated on Sep 3 2017 5:19 AM

పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 9...

ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: సంజయ్ మంజ్రేకర్ (క్రికెటర్), మునాఫ్ పటేల్ (క్రికెటర్)
 
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 9. ఇది కుజుడికి సంబంధించిన సంఖ్య కావడం వల్ల మైన్లు, సిమెంట్, ఎలక్ట్రికల్, రియల్ ఎస్టేట్ రంగాలలో ఉన్న వారికి బాగుంటుంది. కుజప్రభావం వల్ల కొంత దూకుడుగా ప్రవర్తించే అవకాశం ఉంది. అధికారులతోనూ, తోటివారితోనూ వాగ్వివాదాలు, కుటుంబ సభ్యులతో వాదులాటలతో అందరినీ దూరం చేసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి మాట్లాడేప్పుడు సంయమనం పాటించడం మంచిది. అయితే 9 నవ వసంత చక్రం చివరి దశ కావడం వల్ల సంవత్సరమంతా సంపూర్ణత, సంతృప్తి, కార్యసిద్ధి కలుగుతాయి. సంతానం పురోగతి సంతృప్తినిస్తుంది. మీ డేటాఫ్ బర్త్ 12. దీనికి బృహస్పతి అధిపతి. దీనిమూలంగా మీరు మంచి ఊహాశక్తి, చతురత కలిగి ఉండటం వల్ల అందరూ మిమ్మల్ని ఆత్మీయులుగా చూస్తారు.
లక్కీ నంబర్స్: 3,5,9; లక్కీ కలర్స్: ఎల్లో, క్రీమ్, గోల్డెన్, శాండల్, బ్లూ;లక్కీ డేస్: ఆది, మంగళ, గురువారాలు.
సూచనలు: వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించాలి. తొందరగా ధనవంతులు కావాలనే కోరికను తగ్గించుకోవాలి. దక్షిణామూర్తిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం, గురువులను, పండితులను గౌరవించడం, అనాథలకు ఆసరా ఇవ్వడం మంచిది.
- డాక్టర్ ముహ్మద్ దావూద్

Advertisement
 
Advertisement
Advertisement