పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు | Birthday celebrated Celebrities | Sakshi
Sakshi News home page

పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

Jun 22 2015 12:46 AM | Updated on Sep 3 2017 4:08 AM

పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 9...

ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు:విజయ్ (హీరో), దేవయాని(నటి)

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 9. ఆస్తులు కొనాలన్న వీరి కోరిక ఈ సంవత్సరం తీరుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు, తగాదాలు ఒక కొలిక్కి వస్తాయి. వాహనాలు కొంటారు. అయితే వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది. పుట్టిన తేదీలో రెండు రెండ్లు ఉండటం వల్ల మీ కల్పనాశక్తి వెలుగులోకి వస్తుంది. దూకుడుగా, నిర్మొహమాటంగా వ్యవహరించడం వల్ల సహోద్యోగులతోనూ, తోటివారితోనూ వివాదాలు తలెత్తవచ్చు. ప్రేమ వ్యవహారాలలో జాగ్రత్తలు అవసరం. లక్కీ డేస్: 1,4,6,9; లక్కీ కలర్స్: వయొలెట్, రోజ్, ఆరంజ్, రెడ్; లక్కీ డేస్: ఆది, సోమ, మంగళ, శుక్రవారాలు సూచనలు: మాట లలోనూ, చేతలలోనూ సంయమనం పాటించాలి. దుర్గాదేవి ఆలయాన్ని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి, పూజలు చేయించుకోవాలి. ప్రసిద్ధమైన దర్గా లు లేదా చర్చిలను తప్పక సందర్శించండి. మత విశ్వాసం వున్న వారు ఆయా మతగ్రంథాలను పఠించడం మంచిది.
- డా. మహమ్మద్ దావూద్, జ్యోతిష, సంఖ్యాశాస్త్ర నిపుణులు

Advertisement
 
Advertisement
Advertisement