సుగంధ వైద్యం | Benefits with cardamom | Sakshi
Sakshi News home page

సుగంధ వైద్యం

Sep 23 2018 11:40 PM | Updated on Sep 24 2018 12:07 AM

Benefits with cardamom  - Sakshi

ఒక సుగంధద్రవ్యంగా యాలుకతో నోటి దుర్వాసనను అరికట్టవచ్చు. శ్వాసలో తాజాదనాన్ని నింపవచ్చు. నోట్లో ఒక యాలకుల పలుకువేసుకుని సాధారణంగా చాలామంది ఆ ప్రయోజనాన్ని పొందుతుంటారు. నిజానికి ఈ చిన్న పనులతో పాటు ఆరోగ్యపరంగా ఎంతో పెద్ద ప్రయోజనాలు ఇస్తాయి యాలకులు. వాటితో కలిగే ఆరోగ్య ప్రయోజనాల్లో ఇవి కొన్ని.

♦ యాలకులు జీవక్రియలను వేగవంతం చేస్తాయి. జీర్ణరసాల స్రావాలను ప్రేరేపించడం ద్వారా అవి మంచి జీర్ణక్రియకు తోడ్పడతాయి.
♦    యాలకులు జీర్ణవ్యవస్థకు సంబంధించిన అనేక రుగ్మతలను... అంటే యాసిడ్‌ పైకి తన్నడాన్ని (యాసిడ్‌ రిఫ్లెక్స్‌), ఛాతీలో మంట, డయేరియా వంటి వాటిని అరికడతాయి.
♦    వీటిలోని యాంటీఆక్సిడెంట్స్‌ కొలెస్ట్రాల్‌ పాళ్లను తగ్గిస్తాయి. తద్వారా గుండెకు మేలు చేస్తాయి.
♦    యాలకులలోని యాంటీఆక్సిడెంట్స్‌ ప్రమాదకరమైన ఎన్నో రకాల క్యాన్సర్లను నివారిస్తాయి. యాలకుల పౌడర్‌ను ఉపయోగిస్తూ చేసిన ఔషధాలు క్యాన్సర్‌ గడ్డలను కరిగించగలవని కొన్ని అధ్యయనాల్లో స్పష్టంగా తేలింది.
♦   ఆస్తమాలో కనిపించే పిల్లికూతలు, దగ్గు, ఛాతీ పట్టేసినట్లు ఉండటం వంటి ఎన్నో రకాల సమస్యలను యాలకులు తేలిగ్గా పరిష్కరిస్తాయి. ఊపిరితిత్తుల నిండా గాలిని ధారాళంగా పీల్చుకునేందుకు ఇవి దోహదపడతాయి. ఊపిరితిత్తుల్లోని ఇన్‌ఫ్లమేషన్‌ను నివారిస్తాయి.  
♦    శారీరక సమస్యలకే కాదు... మానసిక సమస్యల పరిష్కారంలోనూ యాలకులు బాగా తోడ్పడతాయి. క్రమం తప్పకుండా యాలకులు వాడితే అవి డిప్రెషన్‌ను దూరం చేస్తాయని అధ్యయనాల్లో తేలింది.
♦    డయాబెటిస్‌ను నివారించడంలో లేదా డయాబెటిస్‌ను ఆలస్యం చేయడంలో యాలకుల భూమిక చాలా విశిష్టమైనది.
♦  యాలకులు రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి.
♦   రక్తంలోని గడ్డలను (క్లాట్స్‌ను) నివారించడం ద్వారా అవి రక్తప్రసరణ సాఫీగా అయ్యేలా చూస్తాయి. తద్వారా గుండెపోటును, పక్షవాతాన్ని నివారిస్తాయి.
♦   అనేక రకాల చర్మసమస్యలను దూరం చేస్తాయి. మేనిలో మంచి నిగారింపును తెస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement