
ఆరు టీ స్పూన్ల పెట్రోలియమ్ జెల్లీలో రెండు టీ స్పూన్ల గ్లిజరిన్, రెండు టీ స్పూన్ల నిమ్మరసం కలపాలి. ఈ విధంగా తయారు చేసుకున్న మాయిశ్చరైజర్‌ని రాత్రి పడుకోబోయే ముందు శరీరానికంతటికీ పట్టించాలి. వారంలో కనీసం రెండుసార్లయినా ఇలా చేస్తే చర్మం పొడిబారడం తగ్గి మృదువవుతుంది.
అర టీ స్పూన్ నిమ్మరసంలో కొద్దిగా గంధం తీసుకుని పే‹స్ట్‌లా కలుపుకోవాలి. ఇందులో బొప్పాయి గుజ్జుని కలపాలి. వేళ్లతో ఈ మిశ్రమాన్ని తీసుకుని ముఖంపై వలయాకారంలో సుతిమెత్తగా మర్దనా చేయాలి. ఇది స్క్రబ్‌లా ఉపయోగపడడమే కాకుండా, చర్మకాంతి కూడా మెరుగవుతుంది.