నయనమనోహరం | beauty tips:eyebrows | Sakshi
Sakshi News home page

నయనమనోహరం

May 17 2018 12:19 AM | Updated on May 17 2018 12:19 AM

beauty tips:eyebrows - Sakshi

కనురెప్పల వెంట్రుకలు నల్లగా, పొడవుగా పెరగాలంటే మూడు టేబుల్‌ స్పూన్ల కొబ్బరి నూనెలో రెండు చుక్కల టీట్రీ ఆయిల్‌ కలిపి అప్లయ్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని చాలా కొద్దిగా తీసుకుని కళ్లలోకి జారకుండా రెప్పల వెంట్రుకలకు మాత్రమే సరిపోయేటట్లు రాయాలి. రాత్రి పడుకునే ముందు అప్లయ్‌ చేస్తే మంచిది. కనుబొమలు పలుచగా ఉన్నా కూడా ఈ మిశ్రమాన్ని వాడవచ్చు. కనుబొమల వద్ద చర్మం పొడిబారి డాండ్రఫ్‌ వంటి సమస్యలు వచ్చినా కూడా ఈ కొబ్బరినూనె, టీట్రీఆయిల్‌ సమర్థంగా తగ్గిస్తాయి. 

∙రోజూ పడుకునే ముందు స్వచ్ఛమైన ఆముదాన్ని రాసుకుంటే కనురెప్పలు ఆరోగ్యంగా పెరుగుతాయి. ∙కొందరికి కనురెప్పల వెంట్రుకలు చిక్కగా ఉంటాయి కాని స్కిన్‌ కలర్‌లో కలిసిపోయినట్లుంటాయి. ఫంక్షన్ల వంటి ప్రత్యేక సందర్భాలలో మస్కారాతో నల్లగా కనిపించేటట్లు చేయవచ్చు. మస్కారా వాడినప్పుడు ఇంటికి వచ్చిన వెంటనే బేబీ ఆయిల్‌ కాని ఆముదం కాని రాసి మస్కారాను పూర్తిగా తుడిచేయాలి. ఈ ఒక్కసారికే కదా అని తలకు వేసే హెయిర్‌ డైను ప్రత్యామ్నాయంగా ఎంచుకోకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ హెయిర్‌డైని కళ్ల దగ్గరకు రానీయకూడదు. 

Advertisement
 
Advertisement
Advertisement