మీరు మరీ పొడుగా? | Sakshi
Sakshi News home page

మీరు మరీ పొడుగా?

Published Mon, Nov 7 2016 11:33 PM

మీరు మరీ పొడుగా?

బ్యూటిప్స్

సాధారణంగా పొడవుగా ఉండాలని, పొడవు లేకున్నా వేసుకునే డ్రస్ ద్వారానైనా పొడవుగాకనిపించాలని కోరుకోవడం సహజం. కానీ ఎక్కువ పొడవుగా ఉండడమే కొందరికి సమస్య అవుతుంది. అలాంటి సమస్యను ఎదుర్కొంటూ, నార్మల్‌గా కనిపించాలని ప్రయత్నిస్తుంటే ఇలా చేయండి...  భుజాల నుంచి మోకాళ్ల వరకు ఉండే టాప్స్ వేస్తే మరీ పొడవుగా కనిపిస్తారు. చుడీదార్, సల్వార్ కమీజ్, జీన్స్ మీద టాప్... సింగిల్ కట్‌తో ఉన్నవి కాకుండా నడుము వరకు- నడుము నుంచి రెండు భాగాలుగా విడగొట్టినట్లుంటే బాగుంటాయి.

 సన్నగా, టైట్‌గా ఉండే బెల్టులను ధరించకూడదు. వెడల్పుగా ఉండి నడుమును వదులుగా చుట్టినట్లుండే మోడల్స్ బాగుంటాయి. వీలు అయినంత వరకు మిక్స్ అండ్ మ్యాచ్‌కే ప్రాధాన్యం ఇవ్వాలి. అలా మ్యాచ్ చేసేటప్పుడు ఒకటి డార్క్ కలర్ ఉండే రెండవది తప్పని సరిగా లైట్ కలర్ ఉండేటట్లు చూడాలి.

Advertisement
 
Advertisement
 
Advertisement