బ్యాక్ బ్యూటీ కోసం... | beauty tips | Sakshi
Sakshi News home page

బ్యాక్ బ్యూటీ కోసం...

Aug 6 2015 11:03 PM | Updated on Apr 3 2019 4:08 PM

బ్యాక్ బ్యూటీ కోసం... - Sakshi

బ్యాక్ బ్యూటీ కోసం...

చీరలకు తగ్గట్టుగా అందమైన బ్లౌజులు వేసుకోవాలని ఎవరైనా కోరుకుంటారు.

బ్యూటిప్స్
 
చీరలకు తగ్గట్టుగా అందమైన బ్లౌజులు వేసుకోవాలని ఎవరైనా కోరుకుంటారు. కానీ కొందరికి వీపుపై ఉండే మొటిమలు, మచ్చల కారణంగా వారు డీప్ నెక్స్ వేసుకోవడానికి భయపడుతుంటారు. అలాంటి వారు వారానికోసారి బ్యాక్ ప్యాక్ వేసుకుంటే ఆ సమస్య నుంచి దూరం కావచ్చు. ఒక కప్పు తేనెను వేడి చేసి పెట్టుకోవాలి.

అది కొద్దిగా చల్లారాక అందులో చక్కెర వేసి వీపుపై ప్యాక్ వేసుకోవాలి. ఓ అరగంట తర్వాత వృత్తాకారంలో మర్దన చేసుకుంటూ గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా రెగ్యులర్‌గా ఓ నెలపాటు చేస్తే వీపుపై మొటిమలు, మచ్చలు మాయమవుతాయి.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement