వండర్ ప్యాక్స్ | beauty tips | Sakshi
Sakshi News home page

వండర్ ప్యాక్స్

Jul 1 2015 10:47 PM | Updated on Sep 3 2017 4:41 AM

వండర్ ప్యాక్స్

వండర్ ప్యాక్స్

చర్మం పొడిబారడం ఈ కాలం ఎదుర్కొనే ప్రధాన సమస్య. ఇంట్లోనే కొన్ని ఫేస్‌ప్యాక్స్ వేసుకొని మృదుత్వాన్ని కాపాడుకోవచ్చు.

చర్మం పొడిబారడం ఈ కాలం ఎదుర్కొనే ప్రధాన సమస్య. ఇంట్లోనే కొన్ని ఫేస్‌ప్యాక్స్ వేసుకొని మృదుత్వాన్ని కాపాడుకోవచ్చు.రెండు టేబుల్ స్పూన్ల జొజోబా ఆయిల్ (మార్కెట్లో లభిస్తుంది), రెండు టేబుల్ స్పూన్ల తాజా పెరుగు, టీ స్పూన్ తేనె ఈ మూడూ ఒక పాత్రలో వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి 10-15 నిమిషాలు ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరచాలి. పొడి చర్మం గలవారికి ఇది మహత్తరమైన ఫేస్‌ప్యాక్.

రెండు టేబుల్ స్పూన్ల గంధంపొడి, అరకప్పు రోజ్‌వాటర్, టేబుల్ స్పూన్ పసుపు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించాలి. అరగంట తర్వాత చల్లని నీటితో శుభ్రపరచాలి. ఈ ఫేస్‌ప్యాక్ రోజూ వేసుకోవడం వల్ల ముఖంపై మురికి, మచ్చలు తగ్గి చర్మకాంతి పెరుగుతుంది.ఈ కాలం సహజసిద్ధమైన బ్లీచింగ్‌గా ఉపయోగపడేది దోస లేదా కీర. వీటిని గుజ్జు చేసి ముఖానికి, మెడకు, చేతులకు రాసుకోవాలి. పది నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. జిడ్డు చర్మం గల వారికి ఈ ప్యాక్ బాగా పనిచేస్తుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement