బ్యాట్ ‘డాక్టర్’ | Bat 'doctor' | Sakshi
Sakshi News home page

బ్యాట్ ‘డాక్టర్’

Jul 18 2014 11:47 PM | Updated on Sep 2 2017 10:29 AM

బ్యాట్ ‘డాక్టర్’

బ్యాట్ ‘డాక్టర్’

అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్‌కు డబుల్ సెంచరీ ఎలా సాధ్యమైంది? టెస్టుల్లో సెహ్వాగ్ ట్రిపుల్ సెంచరీలు ఎలా కొట్టగలిగాడు? భారత కెప్టెన్ ధోని హెలికాప్టర్ షాట్లను అంత ఈజీగా ఎలా ఆడగలడు?

అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్‌కు డబుల్ సెంచరీ ఎలా సాధ్యమైంది? టెస్టుల్లో సెహ్వాగ్ ట్రిపుల్ సెంచరీలు ఎలా కొట్టగలిగాడు? భారత కెప్టెన్ ధోని హెలికాప్టర్ షాట్లను అంత ఈజీగా ఎలా ఆడగలడు? టి20ల్లో రైనా సక్సెస్‌కు కారణమేంటి? వీటన్నింటికీ సమాధానం రామ్ భండారి బ్యాటే. బెంగళూరుకు చెందిన 53 ఏళ్ల రామ్ భండారి చేసిన బ్యాట్ పట్టనిదే భారత క్రికెటర్లకు బ్యాటింగ్ చేసినట్లు అనిపించదు.  

నమ్మలేకపోయినా ఇది నిజం. కొన్నేళ్లుగా భారత క్రికెటర్లకు ఈ బ్యాట్ డాక్టరే బ్యాట్లను తయారు చేసి ఇస్తున్నాడు. చాలా మంది క్రికెటర్ల బ్యాట్లకు అతనే డాక్టర్. కొత్త బ్యాట్ తయారు చేయాలన్నా.. వారికి ఇష్టమైన బ్యాట్‌ను రిపేర్ చేసి ఇవ్వాలన్నా భారత క్రికెటర్లు బెంగళూరులో భండారి ఇంటి తలుపులు తట్టాల్సిందే.. ప్రతీ సిరీస్‌కు ముందు, ఆ తర్వాత క్రికెటర్లు ఈ బ్యాట్ డాక్టర్‌ను కలసి తమ బ్యాట్‌లను సరి చేయించుకుంటారు. అవసరమైతే ఓ రెండు రోజులు బెంగళూరులోనే ఉండి మరీ క్రికెటర్లు తమ సొంత పట్టణాలకు వెళ్తారంటే అతిశయోక్తి కాదు.
 
వడ్రంగి నుంచి బ్యాట్ ఎక్స్‌పర్ట్...

53 ఏళ్ల రామ్ భండారి వడ్రంగిగా జీవితాన్ని ఆరంభించాడు. బీహార్‌లో తన తాత దగ్గర వడ్రంగి పనులు నేర్చుకున్న భండారి 1979లో బెంగళూరులో స్థిరపడ్డాడు. కార్పెంటర్‌గా తనకున్న నైపుణ్యంతో బ్యాట్‌లు తయారు చేయడం, వాటిని రిపేర్ చేయడంపై దృష్టిపెట్టాడు. అనతికాలంలోనే మంచి బ్యాట్‌లను తయారుచేయడంలో దిట్టగా మారాడు.

తొలుత స్థానిక క్రికెటర్లకు బ్యాట్‌లను తయారుచేసిచ్చే భండారి దశ మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్‌తో మారిపోయింది. భండారిని బెంగళూరులోనే ఉన్న జాతీయ క్రికెట్ అకాడమీలో తోటి క్రికెటర్లకు ద్రవిడ్ పరిచయం చేశాడు. 2004 నుంచి రిటైరయ్యే వరకు మాస్టర్... భండారి చేసిన బ్యాట్‌లనే ఉపయోగించాడు. క్రికెట్ ఆటను, అభిరుచిని బట్టి బ్యాట్‌లు తయారుచేయడం ఈయన ప్రత్యేకత.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement