నల్ల గుడ్డు చుట్టూ గుండ్రంగా తెల్లగా...

Artificial tears Should be used in Consultation with a Doctor - Sakshi

ఐ కౌన్సెలింగ్స్‌

నా వయస్సు 17 ఏళ్లు. సంవత్సరం క్రితం నాకు రెండు కళ్లలోనూ కార్నియా (నల్లగుడ్డు) చుట్టూ తెల్లగా వచ్చింది. కళ్ల డాక్టర్‌గారికి చూపించాను. ‘డస్ట్‌ అలర్జీ’ అన్నారు. ఐ డ్రాప్స్‌ రాసి ఇచ్చారు. అవి వేసుకున్న కొన్ని నెలలకు తగ్గినట్లే తగ్గి వుళ్లీ మెుదటిలో లాగానే వచ్చింది.

ఎన్నో కంటి ఆసుపత్రుల్లో చూపించాను. కానీ ఇది వూత్రం తగ్గడం లేదు. దయచేసి సలహా ఇవ్వండి. గత రెండు నెలలుగా కళ్లు బాగా దురద పెడుతున్నాయి. ఎరుపెక్కుతున్నాయి. భవిష్యత్తులో ఏదైనా సవుస్య ఎదురవతుందేమోనని భయంగా ఉంది. 

ఇది అలర్జీతో వచ్చిన సవుస్యే. బయటి కాలుష్యానికీ, పుప్పొడికీ, దువు్మూ ధూళి వంటి వాటికి ఎక్స్‌పోజ్‌ అయితే అలర్జీ ఉన్నవాళ్లకు ఇలాంటి సవుస్య వచ్చే అవకాశం ఉంది. వైద్య పరిభాషలో దీన్ని ‘వీకేసీ’ అంటే... వెర్నల్‌ కెరటో కంజక్ట వైటిస్‌’ అంటారు. అందుకే మనం కాలుష్యాలకు దూరంగా ఉంటూ, కంటిని ఎప్పుడూ రక్షించుకోవాలి. రక్షణ కోసం ప్లెయిన్‌ ప్రొటెక్టివ్‌ గ్లాసెస్‌ వాడితే చాలావుట్టుకు రక్షణ ఉంటుంది. ఈ సవుస్య ఉన్నవారు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు కంటిని స్వచ్ఛమైన నీటితో కడుగుతూ ఉండాలి. డాక్టర్‌ను సంప్రదించి యాంటీ అలర్జిక్‌ చుక్కల వుందు ఎక్కువ కాలం వాడాల్సి ఉంటుంది. ఇందులో స్టెరాయిడల్, నాన్‌ స్టెరాయిడల్‌ (స్టెరాయిడ్‌ లేనివి) అనే రెండు మందులు ఉంటాయి. స్టెరాయిడ్‌ మాత్రం డాక్టర్‌గారి పర్యవేక్షణలో తాత్కాలికంగానే వాడాలి. దీర్ఘకాలం వాడకూడదు. దీనికి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయి. నాన్‌స్టెరాయిడ్‌ (స్టెరాయిడ్‌ లేనివి) వంటివి మాత్రం చాలా కాలం వరకు వాడవచ్చు.

ఉదాహరణకు ఓలోపాటడిన్‌ వంటి నాన్‌స్టెరాయిడ్‌ డ్రాప్స్‌ రోజుకు రెండుసార్లు చొప్పున ఆరుమాసాల వరకు వాడవచ్చు. అలాగే లూబ్రికెంట్‌ డ్రాప్స్‌ కూడా వాడాలి. దాంతో అలర్జెన్స్‌ పలచబారుతాయి. కంటికి ఉపశమనం కలుగుతుంది. అప్పుడు నల్లగుడ్డు చుట్టూ ఉన్న తెల్లటి రంగు క్రమంగా మాయమవుతుంది. మీకు దేనితో అలర్జీ వస్తుందో గుర్తించి, దాని నుంచి దూరంగా ఉండాలి. ఎక్కువ అలర్జీ ఉన్నప్పుడు యాంటీహిస్టమైన్‌ ఐ డ్రాప్స్, యాంటీహిస్టమైన్‌ మాత్రలు కూడా వాడాల్సి వస్తుంది. ఆ మందులతో తప్పకుండా అలర్జీ నియంత్రణలోకి వస్తుంది. ఈ సవుస్యను దీర్ఘకాలం ఇలాగే వదిలేస్తే చూపు వుందగించడం, కార్నియా పొర దెబ్బతినడం వంటి సవుస్యలు వస్తాయి కాబట్టి వీలైనంత త్వరగా డాక్టర్‌కు చూపించుకొని దీర్ఘకాలం వుందులు వాడండి. ఇప్పుడు ఆధునికమైన వుంచి వుందులు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఈ సవుస్య గురించి ఆందోళనపడాల్సిందేమీ లేదు.

కళ్లు పొడిబారుతున్నాయి... పరిష్కారం చెప్పండి

నా వయసు 47 ఏళ్లు. నేను దాదాపుగా ఎప్పుడూ కంప్యూటర్‌పైనే వర్క్‌ చేస్తుంటాను. కళ్లు విపరీతంగా పొడి బారుతున్నాయి. ఈ వేసవి ఎండవేడితో ఈ ఫీలింగ్‌ మరీ ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తోంది. దాంతో మాటిమాటికీ వెళ్లి... నీళ్లతో కళ్లు కడుక్కొని వస్తున్నాను. నా సమస్య ఏమిటి? దానికి పరిష్కారం సూచించండి. 

కంప్యూటర్‌పై ఎప్పుడూ కనురెప్పలు తదేకంగా ఏకాగ్రతతో ఆర్పకుండా చూసేవారికి కన్నుపొడిబారే సమస్య రావచ్చు. దీనికి వయసు పైబడటం, ఎప్పుడూ ఎయిర్‌కండిషన్డ్‌ గదుల్లో ఉండటం, కంటికి గాయం కావడం వంటి కారణాలు కూడా ఉండవచ్చు. వైద్యపరిభాషలో ఈ సమస్యను ‘కెరటో కంజంక్టివైటిస్‌ సిక్కా’ అంటారు. ఇందులో కంటిలోని కార్నియా, కంజంక్టివా పొరలు పొడిబారిపోతాయి. దీన్నే ‘కంప్యూటర్‌ విజన్‌ సిండ్రోమ్‌’ అని కూడా అంటారు. ఈ సమస్యకు నివారణ కోసం చేయాల్సినవి... 

►కంటి రెప్పలను తరచూ ఆర్పుతూ ఉండాలి. ఎప్పుడూ తదేకంగా చూస్తూ ఉండకూడదు

►మనం చదువుతున్నప్పుడు తగినంత వెలుతురు ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి

►చదువుతున్నప్పుడు మధ్యమధ్య కాసేపు కంటికి విశ్రాంతినివ్వండి. చిన్న అక్షరాలను చాలాసేపు చదవద్దు. అలా చదవాల్సి వస్తే మధ్య మధ్యన కాసేపు దూరంగా కూడా చూపును ప్రసరిస్తూ ఉండండి. మనం చదవాల్సినదెప్పుడూ కంటి కంటే కిందనే ఉండాలి. పై వైపు చూస్తూ చదవాల్సి వస్తే అది కేవలం కాసేపే తప్ప... ఎప్పుడూ అలా ఉండే అక్షరాలను చదువుతూ ఉండవద్దు మీరు చదవాల్సినప్పుడూ నేరుగా ఉండాలి. స్క్రీన్‌ను వాలుగా ఉంచి చదవవద్దు. మీరు స్క్రీన్‌పై చూడాల్సి ఉన్నప్పుడు ఎక్కువ చూడాల్సిన స్క్రీన్‌కూ, దాని బ్యాక్‌డ్రాప్‌కూ ఎక్కువ కాంట్రాస్ట్‌ లేకుండా చూసుకోండి

►టీవీ చూసేటప్పుడు గదిలో వెలుతురు ఉండేలా చూసుకోండి. చీకట్లో టీవీ చూడవద్దు. టీవీ చూసే సమయంలో స్క్రీన్‌నే తదేకంగా చూడవద్దు. మధ్య మధ్యన దృష్టిని మరలుస్తూ ఉండాలి తరచూ ఆరుబయటకు వెళ్తూ ఉండండి. ఎప్పుడూ ఏసీలో ఉండేవారు తరచూ  స్వాభావికమైన సూర్యకాంతిలో వెలుతురుకూ ఎక్స్‌పోజ్‌ అయ్యేలా జాగ్రత్త తీసుకోవాలి. ఏసీ ఇంటెన్సిటీని మరీ ఎక్కువగా పెంచుకోవద్దు. ఇది కళ్లు మరీ పొడిబారడానికి దారితీస్తుంది. రూమ్‌లో హ్యుమిడిఫైయర్స్‌ ఉంచుకోవాలి.

డాక్టర్‌ను సంప్రదించి ఆర్టిఫిషియల్‌ టియర్స్‌ వాడాలి. యాంటీ గ్లేర్‌ గ్లాసెస్‌ కొంతవరకు మీకు ఉపయోగపడతాయి ∙శరీరం నుంచి నీటి పాళ్లు తగ్గకుండా ఉండటం కోసం తరచూ ద్రవాహారం తీసుకుంటూ ఉండాలి. ఒమెగా ఫ్యాటీ ఆసిడ్స్‌ ఉండే ఆహారం గానీ లేదా కాప్సూ్యల్‌ గానీ తీసుకోవాలి.  మీరు తీసుకునే ఆహారంలో అన్ని పోషకాలు అంటే... అన్నిరకాల వైటమిన్లు (ఏ, బీ,సీ), ఖనిజాలు... ముఖ్యంగా జింక్‌ ఉండేలా చూసుకోండి ∙ఆరుబయట తిరిగేప్పుడు కళ్లజోడును కాసేపు తీయండి.

►ఒత్తిడిని తగ్గించుకోవాలి. యోగా వంటి రిలాక్సేషన్‌ టెక్నిక్స్‌ను అవలంబించండి

►కంటికి మురికి తగలకుండా జాగ్రత్తలు తీసుకోండి. చేతులు మురికి అయినప్పుడు వాటితోనే కళ్లు తుడుచుకోవద్దు

►మీ కళ్లు శుభ్రం చేసుకోడానికి, ముఖం కడక్కోడానికి శుభ్రమైన నీటిని ఉపయోగించండి. అందులో డిటర్జెంట్‌ లేకుండా చూసుకోండి

►పొగతాగే అలవాటు, ఆల్కహాల్‌ అలవాట్లను తక్షణం మానివేయండి.

డాక్టర్‌ కె. రవికుమార్‌ రెడ్డి కంటి వైద్య నిపుణులు,
మెడివిజన్‌ ఐ హాస్పిటల్,హైదరాబాద్‌.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top