అలియా 'ఫి'భట్‌ | Alia Bhatt decreased to 18 kg just 3 months | Sakshi
Sakshi News home page

అలియా 'ఫి'భట్‌

Mar 29 2017 11:51 PM | Updated on Sep 5 2017 7:25 AM

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కుర్రకారు కలల రాణి అలియా భట్‌.

http://img.sakshi.net/images/cms/2017-03/61490812017_Unknown.jpg‘జిమ్‌’దగీ
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కుర్రకారు కలల రాణి అలియా భట్‌. అందమైన చిరునవ్వుతో కట్టి పడేస్తూ అటు కుర్ర హీరోలతో మాత్రమే కాకుండా ఇటు సీనియర్‌ హీరోలకూ జంటగా మెప్పించేస్తోంది. చూడ చక్కని నాజూకు రూపంతో మెరిసిపోయే అలియా భట్‌ ఒకప్పుడు చాలా బొద్దుగా ఉండేది. అంతేకాదు ఫ్యాటీ లుక్‌ కారణంగా తొలి సినిమా ఛాన్స్‌ చేజారేంత పరిస్థితి కూడా వచ్చింది. మరి అలాంటి అలియా... తన ఫిట్‌నెస్‌ను సినిమా స్క్రీన్‌ మీద కాంతులీనేలా చేసుకుంది ఎలా అంటే...

3నెలల్లో 18కిలోలు లాస్‌... అలియా తొలి మూవీ స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌. బాలీవుడ్‌ ప్రముఖుడు కరణ్‌ జోహార్‌ రూపొందించిన ఆ సినిమా అవకాశం ఆమెకు వచ్చే సమయానికి ఆమె వయసు 17ఏళ్లు.  ఎత్తు 5.2 అడుగులు. బరువు దాదాపు 70కిలోలు. ఒకనాటి విఖ్యాత డైరెక్టర్‌ మహేష్‌భట్‌ కూతురైనా, పూజాభట్‌ లాంటి నటికి చెల్లెలైనా...  సినిమా హీరోయిన్‌ ఛాన్స్‌ దక్కించుకోవాలంటే బరువు తగ్గాల్సిందేనని నిక్కచ్చిగా చెప్పేశాడు కరణ్‌. దాంతో పంతం పట్టింది అలియా. కేవలం 3 నెలల్లోనే 18కిలోల వరకూ తగ్గింది. సినిమా చాన్స్‌ దక్కించుకోవడంతో పాటు ఇప్పడు స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది.

ఇదీ రొటీన్‌... వెయిట్‌లాస్‌ అనేది వర్కవుట్‌ కన్నా డైట్‌ మీదే అధికంగా ఆధారపడి ఉంటుంది అంటుంది అలియా. అందుకే ఆమె తనకెంతో ఇష్టమైన జంక్‌ఫుడ్‌ని టీనేజ్‌లోనే త్యాగం చేసేసింది. వీలైనన్ని లీటర్ల నీళ్లు, కూరగాయలు, ఫ్రూట్స్‌ వినియోగిస్తుంది. తక్కువ నూనె ఉపయోగించి రుచికరంగా వంటలు చేయడం అప్పట్లోనే అలవాటు చేసుకున్న అలియా తన తల్లితో కలిసి వంటల్లో ప్రయోగాలు చేస్తుంటుంది. నిద్రపోవడానికి కనీసం 2గంటల ముందే డిన్నర్‌ పూర్తి చేసేస్తుంది. బ్రేక్‌ఫాస్ట్‌లో పంచదార లేని టీ, చిన్న కప్పుతో పోహా (మరాఠీ వంటకం) లేదా వెజ్‌ సలాడ్‌ లేదా ఎగ్‌ వైట్‌–శాండ్‌విచ్‌ తీసుకుంటుంది. ఆ తర్వాత ఉదయం 11గంటలకు ఒక గ్లాసుడు వెజిటబుల్‌ జ్యూస్, ఒక పండు, ఇక లంచ్‌లో నూనె తగలని రోటీ, ఏదైనా ఒక పండు, ఒక్క ఇడ్లీ, సాంబార్‌తో తీసుకుంటుంది. సాయంత్రం పంచదార లేని టీ, లేదా కాఫీ, మిడ్‌ ఈవెనింగ్‌లో ఫ్రూట్స్, డిన్నర్‌లోకి నూనె లేని రోటీ, గిన్నెడు వెజిటబుల్స్, దాల్, ఒక చికెన్‌ పీస్‌. ఇదీ ఆమె రెగ్యులర్‌ డైట్‌.

వర్కవుట్‌ ఇలా... వారంలో 3 లేదా 4రోజులు జిమ్‌ వర్కవుట్స్‌కి కేటాయిస్తుంది అలియా. ఎక్కువగా కార్డియో, వెయిట్‌ ట్రైనింగ్‌ చేస్తుంది. వార్మప్‌ ట్రెడ్‌ మిల్‌ మీదే చేయడానికి ఇష్టపడుతుంది. పుషప్స్, డంబెల్‌ రైజర్స్, లాట్‌ పుల్‌ డౌన్స్, ట్రైసప్స్‌ పుష్‌ డౌన్‌ ఇవి ఒక సెట్‌గా ఒకరోజు,  క్రంచెస్, బ్యాక్‌ ఎక్స్‌టెన్షన్స్, బైస్కిల్‌ క్రంచెస్, రివర్స్‌ క్రంచెస్‌ మరొక రోజు, స్క్వాట్స్, ఫార్వర్డ్‌ లంజెస్, బ్యాక్‌వర్డ్‌ లంజెస్, డంబెల్‌ లంజెస్‌ ఇంకో రోజు చేస్తుంది. ఇలా రోజుకో బాడీ పార్ట్‌కి వర్కవుట్‌ ఇస్తూనే ఒక్కో రోజు రెస్ట్‌ ఇస్తుంటుంది.
- సమన్వయం: సత్యబాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement