జనవరి కల్లా ‘ఆకాశ్-4’ | Aakash 4 to be available by January 2014: Kapil Sibal | Sakshi
Sakshi News home page

జనవరి కల్లా ‘ఆకాశ్-4’

Aug 7 2013 11:39 PM | Updated on Aug 20 2018 9:16 PM

జనవరి కల్లా ‘ఆకాశ్-4’ - Sakshi

జనవరి కల్లా ‘ఆకాశ్-4’

పడుతూ లేస్తూ సాగుతున్న దేశీయ టాబ్లెట్ ‘ఆకాశ్’ ప్రస్థానంలో నాలుగో వెర్షన్ రాబోతోంది. వచ్చే ఏడాది జనవరి కల్లా ఆకాశ్-4 టాబ్లెట్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది.

 పడుతూ లేస్తూ సాగుతున్న దేశీయ టాబ్లెట్ ‘ఆకాశ్’ ప్రస్థానంలో నాలుగో వెర్షన్ రాబోతోంది. వచ్చే ఏడాది జనవరి కల్లా ఆకాశ్-4 టాబ్లెట్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది. ఇప్పటికే వివిధ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలతో చర్చలు జరిపామని, మొత్తం 11 కంపెనీలు ‘ఆకాశ్’ నాలుగో వెర్షన్ టాబ్లెట్‌ను రూపొందించడానికి సంసిద్ధత ప్రకటించాయని ప్రభుత్వం ప్రకటించింది.
 
ఇక  ఆకాశ్ నాలుగో వెర్షన్ కొత్త సదుపాయాల విషయానికి వస్తే.. ఇందులో ఫోన్ కాలింగ్ సదుపాయం కూడా ఉంటుందని ప్రకటించారు. దీంతో ఆకాశ్‌టాబ్లెట్ ఫాబ్లెట్‌గా మారుతుంది. నాలుగో వెర్షన్ నాలుగో తరం ఇంటర్నెట్(4జీ) ని సపోర్ట్ చేస్తుంది. ఇందులో 4జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది. బ్లూటూత్ సదుపాయం కూడా ఉంటుంది. ధర రూ.2,276.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement