తేనె స్వచ్ఛత తెలియాలంటే

 home made tips

ఇంటిప్స్‌

►కీర దోస, బీర కాయలు కొన్ని చేదుగా ఉంటాయి. చెక్కు తీసే ముందే వాటిని మధ్యలోకి విరిస్తే చేదుబారవు.
►తేనె స్వచ్ఛత తెలియాలంటే, ఒక కప్పు నీటిలో ఒక స్పూన్‌ తేనె వేయాలి. నీటిలో కరగకుండా అడుగుకు చేరితే అది మంచి తేనె.
►వేడి నీటిలో ఉప్పు కలిపి వాడాల్సి వస్తే, నీళ్లు మరిగిన తర్వాత మాత్రమే ఉప్పు  కలపాలి. ముందే ఉప్పు వేస్తే మరగడానికి ఎక్కువ సమయం పడుతుంది.
►చికెన్‌ కాని, మటన్‌ కాని ప్రెషర్‌ కుకర్‌లో ఉడికించినట్లయితే గ్యాస్‌తో పాటు సమయం కూడా ఆదా అవుతుంది. అందులోని పోషకాలు నశించకుండా ఉంటాయి.
►వెల్లుల్లి పొట్టు త్వరగా రావాలంటే అరగంట సేపు నీటిలో నానబెట్టాలి.
►నూనె ఎక్కువగా వేసి చేసే డీప్‌ ఫ్రైలను తగ్గించి వంటకాలను బేక్‌ చేసి తినడం అలవాటు చేసుకుంటే శరీరంలోకి చేరే కొవ్వు శాతం తగ్గుతుంది.
►కాపర్‌ బాటమ్‌ పాత్రలు తళతళ మెరవాలంటే మామూలుగా వాడుతున్న క్లీనింగ్‌ పౌడర్‌ కాని సబ్బు కాని వేసి మెటల్‌ స్క్రబ్బర్‌తో శుభ్రం చేయాలి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top