వైఎస్సార్‌సీపీకి మూడు అసెంబ్లీ, ఒక ఎంపీ | ysrcp won three assembly and one parliament seats | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీకి మూడు అసెంబ్లీ, ఒక ఎంపీ

May 17 2014 12:59 AM | Updated on Aug 29 2018 8:56 PM

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలోనూ ప్రాతినిధ్యం లభించింది. ఒక పార్లమెంట్ స్థానంతో పాటు, మూడు అసెంబ్లీ సెగ్మెంట్‌లను ఆ పార్టీ కైవసం చేసుకుంది.

 సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలోనూ ప్రాతినిధ్యం లభించింది. ఒక పార్లమెంట్ స్థానంతో పాటు, మూడు అసెంబ్లీ సెగ్మెంట్‌లను ఆ పార్టీ కైవసం చేసుకుంది. ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తన సమీప ప్రత్యర్థి నామా నాగేశ్వరరావు(టీడీపీ)పై 17వేలకు పైచిలుకు ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధిం చారు. అదే విధంగా ఖమ్మం జిల్లాలోని పినపాక, వైరా, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ జెండా రెపరెపలాడింది. పినపాక నుంచి పాయం వెంకటేశ్వర్లు, అశ్వారావుపేట నుంచి తాటి వెంకటేశ్వర్లు, వైరా నుంచి బానోతు మదన్‌లాల్‌లు ఘన విజయం సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement