
హైదరాబాద్ బయల్దేరిన వైఎస్ విజయమ్మ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, విశాఖ లోక్సభ అభ్యర్థి వైఎస్ విజయమ్మ గురువారం విశాఖ నుంచి హైదరాబాద్ బయల్దేరారు.
విశాఖ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, విశాఖ లోక్సభ అభ్యర్థి వైఎస్ విజయమ్మ గురువారం ఉదయం విశాఖ నుంచి హైదరాబాద్ బయల్దేరారు. కాగా వైఎస్ విజయమ్మ నిన్న పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో విస్తృతంగా పర్యటించారు.
ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని వివిధ పోలింగ్ బూత్లకు వెళ్లి ఓటింగ్ సరళిపై ఆరా తీశారు. పలు పోలింగ్ బూత్లకు వెళ్లి ఓటర్ల నాడిని ఆమె గమనించారు. భీమిలి నియోజకవర్గం పరిధిలోని మధురవాడ జడ్పీ హైస్కూల్ను నిన్న సాయంత్రం సందర్శించారు. పోలింగ్ కేంద్రం నుంచి బయటకు వస్తుండగా విజయమ్మను అభిమానులు చుట్టుముట్టారు.