చంద్రబాబు నివాసంలో యజ్ఞం | yajnam in chandra babu naidu house | Sakshi
Sakshi News home page

చంద్రబాబు నివాసంలో యజ్ఞం

May 7 2014 1:08 AM | Updated on Aug 10 2018 8:06 PM

తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నివాసంలో ప్రత్యేక యజ్ఞం జరుగుతోంది. గత నాలుగు రోజులుగా రహస్యంగా ఈ యజ్ఞం నిర్వహిస్తున్నారు.

సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నివాసంలో ప్రత్యేక యజ్ఞం జరుగుతోంది. గత నాలుగు రోజులుగా రహస్యంగా ఈ యజ్ఞం నిర్వహిస్తున్నారు. ఇందులో చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి మంగళవారం ప్రత్యక్షంగా పాల్గొన్నారు. పార్టీ అధికారంలోకి రావాలని కోరుతూ ఈ యజ్ఞం నిర్వహిస్తున్నట్లు సమాచారం. ప్రచారం ముగించుకుని చంద్రబాబునాయుడు సోమవారం రాత్రి హైదరాబాద్ చేరుకోవడం తెలిసిందే.

 

కాగా 2009లో జరిగిన సాధారణ ఎన్నికల సమయంలోనూ బాబు నివాసంలో ప్రత్యేకంగా యజ్ఞం నిర్వహించారు. అప్పుడు సైతం బాబు యజ్ఞంలో భాగస్వామి అయ్యారు.


 

Advertisement
 
Advertisement
Advertisement