మోడీ ప్రభంజనంతో గెలుస్తాం | we will win, says venkaiah naidu | Sakshi
Sakshi News home page

మోడీ ప్రభంజనంతో గెలుస్తాం

May 11 2014 12:52 AM | Updated on Aug 15 2018 2:14 PM

రాష్ట్రంలోని రెండు ప్రాంతాల్లోనూ బీజేపీ-టీడీపీ కూటమి గట్టిపోటీ ఎదుర్కొందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు ఎం.వెంకయ్యనాయుడు చెప్పారు.

సీమాంధ్రలో ముఖాముఖీ పోటీ
తెలంగాణలోనూ గట్టిపోటీ: వెంకయ్య
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రెండు ప్రాంతాల్లోనూ బీజేపీ-టీడీపీ కూటమి గట్టిపోటీ ఎదుర్కొందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు ఎం.వెంకయ్యనాయుడు చెప్పారు. సీమాంధ్ర లో ముఖాముఖీ పోటీ తీవ్రస్థాయిలో ఉన్నప్పటికీ తమ కూటమి విజయం సాధిస్తుందన్నారు.  అలాగే, తెలంగాణ లోనూ గట్టి పోటీ ఉంటుందన్నారు. శనివారం విలేకరులతో ఆయన మాట్లాడారు. మోడీ ప్రభంజనం వల్ల సీమాంధ్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజార్టీ వస్తుందని వెంకయ్య ధీమా వ్యక్తంచేశారు. కాంగ్రెస్‌తో టీఆర్‌ఎస్ పార్టీ కలుస్తుందని తాము మొదటి నుంచీ చెబుతున్నామని, ఇప్పుడు కేసీఆర్ యూపీఏకి మద్దతు ఇస్తామని చెప్పడం ద్వారా తాము చెప్పింది నిజమేనని తేలిపోయిందన్నారు.

 

గతంలో నెంబరు వన్ ద్రోహి.. అడుగు కూడా పెట్టడానికే వీలు లేదన్న జగన్‌మోహన్‌రెడ్డి విషయంలో కేసీఆర్ ఇప్పుడు సడెన్‌గా తన భాషను మార్చుకున్నారని వ్యాఖ్యానిం చారు. మోడీ ప్రధాని కావడానికి తమకు కొత్త పార్టీల మద్దతు కోరాల్సిన అవసరం రాదన్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చేవారికి జగన్ మద్దతివ్వాలంటే ముందు ఆయన గెలవాలి కదా అని ఒక ప్రశ్నకు బదులిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement