ఆళ్లగడ్డలో భూమా అఖిల ప్రియ ప్రచారం | we will make mother win with a huge majority, says bhuma akhila priya | Sakshi
Sakshi News home page

ఆళ్లగడ్డలో భూమా అఖిల ప్రియ ప్రచారం

May 1 2014 12:14 PM | Updated on Oct 22 2018 5:46 PM

ఆళ్లగడ్డలో భూమా అఖిల ప్రియ ప్రచారం - Sakshi

ఆళ్లగడ్డలో భూమా అఖిల ప్రియ ప్రచారం

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆళ్లగడ్డ అభ్యర్థి దివంగత శోభానాగిరెడ్డి తరపును ఆమె పెద్ద కుమార్తె భూమా అఖిల ప్రియ గురువారం ప్రచారం ముమ్మరం చేశారు.

కర్నూలు :  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆళ్లగడ్డ అభ్యర్థి దివంగత శోభానాగిరెడ్డి తరపును ఆమె పెద్ద కుమార్తె భూమా అఖిల ప్రియ గురువారం ప్రచారం ముమ్మరం చేశారు. ఎన్నికల్లో శోభా నాగిరెడ్డికి ఓటు వేసి, అమ్మ ఆశయాలను నెరవేర్చండని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. 'అమ్మను పోగొట్టుకొని అందరం పుట్టెడు దుఖంతో ఉన్నాం. ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించి నిజమైన నివాళి అర్పిద్దాం' అని అఖిల ప్రియ అన్నారు.

అందరిని ఆప్యాయంగా పలకరించే అమ్మ భౌతికంగా దూరమైనా మన హృదయాల్లో మాత్రం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే జగనన్న సీఎం అవుతారని, ఆళ్లగడ్డ నియోజకవర్గ అభివృద్ధిపై అమ్మ కన్న కలలను నిజం చేస్తారని ఆమె అన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement