సంక్షేమానికి చిరునామాగా నిలిచిన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయ సాధనకు వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డిని ఆదరించాలని, ప్రస్తుత ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ శ్రీకాకుళం లోక్‌సభ, శాసనసభ సమన్వయకర్తలు రెడ్డి శాంతి, ధర్మాన ప్రసాదరావు కోరారు.
శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్: సంక్షేమానికి చిరునామాగా నిలిచిన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయ సాధనకు వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డిని ఆదరించాలని, ప్రస్తుత ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ శ్రీకాకుళం లోక్‌సభ, శాసనసభ సమన్వయకర్తలు రెడ్డి శాంతి, ధర్మాన ప్రసాదరావు కోరారు.
శ్రీకాకుళంలోని ఎనిమిదో వార్డులోని భద్రమ్మగుడి, ఇల్లీసుపురం కూడలి, పాత ఎంప్లాయిమెంట్ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో శుక్రవారం వారు ఎన్నికల ప్రచారం చేశారు. ఇంటింటికీ తిరిగి వైఎస్సార్‌సీపీ ఆశయాలు, సిద్ధాంతాలు వివరించి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగన్‌మోహన్‌రెడ్డిని సీఎంను చేయాలని కోరారు. ఈ సందర్భంగా రెడ్డి శాంతి మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో రైతులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.
జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తే పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రూ.3 వేల కోట్లతో స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తారని చెప్పారు. ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అమలుచేసిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ద్వారా ఎందరో పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివారన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్న అమ్మ ఒడి పథకం ద్వారా వేలాది మంది పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల పిల్లలు ఉన్నత విద్యనభ్యసిం చేందుకు అవకాశం కలుగుతుందన్నారు.
పిల్లల తల్లులకు కూడా లబ్ధి కలుగుతుందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎంవీ పద్మావతి, చల్లా అలివేలు మంగ, అంధవరపు సూరి బాబు, జేఎం శ్రీనివాస్, అబ్దుల్ రెహ్మాన్, టి.కామేశ్వరి, మండవిల్లి రవి, కె.ఎల్.ప్రసాద్, శిమ్మ వెంకట్రావు, పైడి నిర్మల్‌కుమార్, గుడ్ల మల్లేశ్వరరావు, చల్లా మంజుల, టి.మోహిని, మహమ్మద్ సిరాజుద్దీన్, రావాడ జోగినాయుడు, శ్రీనివాస్ పట్నాయక్, కూన వాసుదేవరావు, స్థానికులు బాలు, హారికాప్రసాద్, గజ్జల లీలావతి, బొడ్డేపల్లి భాస్కరరావు, వై.మురళీమోహన్ పాల్గొన్నారు.