రేపు తొలివిడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు | Tomorrow First phase ZPTC, MPTC polls | Sakshi
Sakshi News home page

రేపు తొలివిడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు

Apr 5 2014 4:24 PM | Updated on Sep 2 2017 5:37 AM

రేపు తొలివిడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు

రేపు తొలివిడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు

తొలి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు అన్ని ఏర్పాట్లు చేసినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమాకాంత్‌రెడ్డి చెప్పారు. ఆదివారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుందని తెలిపారు.

హైదరాబాద్: తొలి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు అన్ని ఏర్పాట్లు చేసినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమాకాంత్‌రెడ్డి చెప్పారు. ఆదివారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుందని తెలిపారు. ఎన్నికలను బ్యాలెట్‌ పద్దతిలో నిర్వహిస్తామని రమాకాంత్ రెడ్డి చెప్పారు.
 
కరీంనగర్ జిల్లా మంథని రెవిన్యూ డివిజన్‌లో మాత్రం ఉదయం 7 నుంచి 4 గంటల వరకే పోలింగ్ నిర్వహిస్తామని వెల్లడించారు. జెడ్పీటీసీకి తెలుపు రంగు‌, MPTC గులాబి రంగు బ్యాలెట్‌ పత్రాలను వాడనున్నట్టు రమాకాంత్ రెడ్డి చెప్పారు. 6,370 పోలింగ్‌ కేంద్రాలను  సమస్యాత్మకమైనవిగా గుర్తించామని, ఎన్నికలను సజావుగా నిర్వహించడానికి 95,031 మంది పోలీసులను మోహరించినట్టు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement