నేడు తెలంగాణలో రాహుల్ ప్రచారం | Today, his campaign to rahul | Sakshi
Sakshi News home page

నేడు తెలంగాణలో రాహుల్ ప్రచారం

Apr 21 2014 1:30 AM | Updated on Mar 18 2019 9:02 PM

నేడు తెలంగాణలో రాహుల్ ప్రచారం - Sakshi

నేడు తెలంగాణలో రాహుల్ ప్రచారం

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ‘ఎన్నికల ప్రచారం’ సోమవారం నుంచి ప్రారంభమవుతోంది.

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ‘ఎన్నికల ప్రచారం’ సోమవారం నుంచి ప్రారంభమవుతోంది. ప్రస్తుతం తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో ఉన్న రాహుల్‌గాంధీ సోమవారం మధ్యాహ్నం 1.30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి మహబూబ్‌నగర్‌కు చేరుకుని బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం నిజామాబాద్ జిల్లా, డిచ్‌పల్లి మండలం సుద్దపల్లిలో నిర్వహిస్తున్న బహిరంగ సభకు హాజరవుతారు. ప్రసంగం ముగిసిన వెంటనే తిరిగి శంషాబాద్ చేరుకుని ఢిల్లీకి ప్రయాణమవుతారు.
 
25న హైదరాబాద్‌లో రోడ్‌షో!: రాహుల్ ఈనెల 25న హైదరాబాద్‌లో రోడ్‌షో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాహుల్ నుంచి సమాచారం రావడంతో నగరంలో ఏయే నియోజకవర్గాల్లో రోడ్‌షో నిర్వహించాలనే అంశంపై టీపీసీసీ నేతలు షెడ్యూల్‌ను రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. రాహుల్ 24న రాత్రి హైదరాబాద్‌కు వస్తారు. మర్నాడు నగరంలో మూడు నాలుగు నియోజకవర్గాల్లో రోడ్‌షో నిర్వహించి, నిజాం కళాశాల మైదానంలో జరిగే సభలో పాల్గొంటారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement