ఎన్నికల ఏజెంట్లుగా..ప్రజా ప్రతినిధులకు అవకాశం లేదు: ఈసీ | there is no chance to Public Representatives as election agents, says election commission | Sakshi
Sakshi News home page

ఎన్నికల ఏజెంట్లుగా..ప్రజా ప్రతినిధులకు అవకాశం లేదు: ఈసీ

Apr 2 2014 12:38 AM | Updated on Aug 14 2018 4:32 PM

ఎలక్షన్ ఏజెంట్లు, పోలింగ్ ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లుగా మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, మండల, జిల్లా పరిషత్ చైర్మన్లను నియమించడానికి వీల్లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

సాక్షి, హైదరాబాద్: ఎలక్షన్ ఏజెంట్లు, పోలింగ్ ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లుగా మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, మండల, జిల్లా పరిషత్ చైర్మన్లను నియమించడానికి వీల్లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. సాయుధ భద్రత ఉన్న ప్రజా ప్రతినిధులను ఎన్నికల ఏజెంట్లుగా నియమించడానికి వీల్లేదని ఎన్నికల సంఘం గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. అయితే భద్రత లేని ప్రజా ప్రతినిధులను ఎన్నికల ఏజెం ట్లుగా నియమించడానికి అవకాశం ఉం దా? అంటూ పుదుచ్చేరి ముఖ్య ఎన్నికల అధికారి స్పష్టత కోరుతూ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.

 

భద్రతతో సంబంధం లేకుండా ప్రజా ప్రతినిధులను ఎన్నికల ఏజెంట్లుగా నియమించడానికి వీల్లేదని స్పష్టం చేస్తూ అన్ని రాష్ట్రాల సీఈవోలకు ఎన్నికల సంఘం కార్యదర్శి సుమీత్ ముఖర్జీ మంగళవారం లేఖ రాశారు.


 

Advertisement
 
Advertisement
Advertisement