దేశం, కాంగ్రెస్ పైసా చికం | TDP,Congress money Distribution | Sakshi
Sakshi News home page

దేశం, కాంగ్రెస్ పైసా చికం

May 6 2014 2:00 AM | Updated on Mar 18 2019 9:02 PM

దేశం, కాంగ్రెస్ పైసా చికం - Sakshi

దేశం, కాంగ్రెస్ పైసా చికం

టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు ఎన్ని‘కల’లు కరిగిపోతున్నాయి. సమైక్యాంధ్ర ఉద్యమంతోనే కాంగ్రెస్ కాడె వదిలేసింది. నిన్నమొన్నటి వరకూ బీరాలు పలికిన టీడీపీ

టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు ఎన్ని‘కల’లు కరిగిపోతున్నాయి. సమైక్యాంధ్ర ఉద్యమంతోనే కాంగ్రెస్ కాడె వదిలేసింది. నిన్నమొన్నటి వరకూ బీరాలు పలికిన టీడీపీ నేతలకు పోలింగ్ ముహూర్తం సమీపించిన వేళ తమవన్నీ పగటికలలేన్న విషయం బోధపడింది. దీంతో ఆ పార్టీలు ప్రజాస్వామ్యానికి సమాధి కడుతున్నాయి. విలువలకు వలువలూడదీసి, బరి తెగించి, నిస్సిగ్గుగా నీచ రాజకీయాలకు దిగుతున్నాయి. మత్తు‘మందు’జల్లి ఓట్లను కాజేయాలని యత్నిస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున టీడీపీ, కాంగ్రెస్ కార్యకర్తలు మద్యం బాటిళ్లతో పట్టుబడుతున్నారు. అయినా వెనక్కి తగ్గడం లేదు. కాంగ్రెస్ నేతలు ఏకంగా దాడులకు దిగుతున్నారు.
 
 సాక్షి ప్రతినిధి, విజయనగరం :పూసపాటిరేగ మండలం చల్లవానితోట శివారు గొల్లపేటలో ఓటర్లకు పంపిణీ చేసేందుకు గాను ఇంట్లో దాచి ఉంచిన 900మ ద్యం బాటిళ్లతో టీడీపీ నాయకుడు కిళ్ల రమణ ఆదివారం అడ్డంగా దొరికిపోయాడు. గంట్యాడ మండలం బోనంగి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేతలు బొగ్గు రమణ, రాజాన రవికుూర్ 10 మద్యం కేసులను తరలిస్తుండగా సోమవారం పోలీసులకు పట్టుబడ్డారు. జామి మండలం భీమసింగి సుగర్ ప్యాక్టరీ వద్ద మద్యం తరలిస్తుండగా టీడీపీ నేత మత్స అచ్చిరాజు పోలీసులకు చిక్కాడు.  బొబ్బిలిలో టీడీపీ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న బైక్‌లకు ఓ పెట్రోల్ బంకులో పెట్రోల్ వేసుకునేందుకు ఒక్కొక్కరికీ రెండేసి లీటర్ల చొప్పున పెట్రోల్ కూపన్లను ఆ పార్టీ నాయకులు పంపిణీ చేశారు. ఇదే సందర్భంలో బైక్ ర్యాలీలో పాల్గొన్న వారందరికీ పెద్ద ఎత్తున డబ్బు లు పంపిణీ చేశారు. వాటితో సమీపంలో ఉన్న వైన్ షాపుకెళ్లి పూటుగా తాగారు.
 
   ఎన్నికల వేళ టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు బరితెగించాయనడానికి ఇవే నిలువెత్తు సాక్ష్యాలు. ఓటమి భయం తో ఆ రెండు పార్టీలూ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు కో ట్లు కుమ్మరిస్తున్నాయి. ఒకవైపు మద్యం పోస్తూనే, మ రోవైపు ఓటుకు నోట్లు పంపిణీ చేస్తున్నాయి. ఈ ఎన్నికలు టీడీపీకి చావోరేవో కావడంతో మునుపెన్నడూలేని విధంగా ప్రలోభాలకు దిగుతోంది. ఆ పార్టీ అనుకూలంగా ఉన్న కార్పొరేట్ సంస్థల అధినేతలు, పా రిశ్రామిక వేత్తలు తీసుకొచ్చిన డబ్బుల మూటలు పోలింగ్ సమీపిస్తున్న నేపథ్యంలో కట్టలు తెంచుకుంటు న్నాయి. ఓటుకి వేయి రూపాయలకు పైనే ముట్టజెప్పుతున్నా రు. జిల్లాలో ఓటర్లకు పంపిణీ చేసేందుకు టీడీపీ సుమారు రూ. 200 కోట్లు సిద్ధం చేసినట్టు సమాచారం.  
 
 మద్యానికి రూ.30 కోట్లు
 ఎన్నికల కమిషన్ మద్యంపై ఎన్ని ఆంక్షలు పెట్టినా ఏ దొక దారిలో వెళ్లాల్సిన వారికి వెళ్తున్నాయి. పోలీసుల క ళ్లు కప్పి పంపిస్తున్నారు. గ్రామాల వారీగా నాయకుల కు టోకెన్లు ఇస్తున్నారు. వాటిని పట్టుకుని వెళ్లిన వారికే అందజేస్తున్నారు. ఒక్క మద్యం కోసమే రూ. 30 కోట్లు ఖర్చు పెడుతున్నట్టు తెలిసింది. ఇప్పటికే చా లాచోట్లకు మద్యం కేసులు చేరిపోయాయి. సిండికేట్లు వారి చేతిలో ఉండడంతో మద్యానికి లోటు లేకుండాపోయింది. కావల్సినంత పంచిపెడుతున్నారు.కాంగ్రెస్ కూడా తామేమి తక్కువ కాదని నిరూపించుకుం టోంది.
 
 కూపన్ల రాజకీయం
 జిల్లాలో టీడీపీ, కాంగ్రెస్ వర్గాలకు చెందిన పలువురు నాయకులు ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు కూపన్ల రాజకీయాన్ని తెరమీదకు తెచ్చారు. ఓటర్లకు నగదు ఇవ్వడం కన్నా వివిధ గృహోపకరణాలను కూప న్ల ద్వారా ఇస్తున్నారు. కూపన్లు పంపిణీ చేసి వారికి ఆయా షాపులకు వెళ్తే సూచించిన ఉపకరణాలను ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇప్పుడా కూపన్లు పంపిణీ చేసే కార్యక్రమం జోరుగా సాగుతోంది. ఈ విషయం లో విజయనగరంలో ఓ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వ హిస్తున్న మహిళా నేత ముందంజలో ఉన్నారు. డ బ్బుకు ఏ మాత్రం వెనుకాడడం లేదు. మంచినీళ్లలా డబ్బు ఖర్చుచేస్తున్నారు. ఇక, కాంగ్రెస్ నేతలు కూడా అదే తరహాలో డబ్బు పంపిణీ చేస్తున్నారు. సోమవారం ఒక్క రోజే బైక్ ర్యాలీల ముసుగులో కోట్లాది రూపాయ ల పంపిణీ చేశారు.  
 
 నకిలీ ఒపీనియన్ పోల్‌తో టీడీపీ కోడ్ ఉల్లంఘన
 ఒపీనియన్ పోల్స్ నిర్వహించకూడదన్న ఈసీ నిబంధనలను టీడీపీ ఉల్లంఘిస్తోంది.ఇప్పటికే జిల్లాలోని తొ మ్మిది నియోజకవర్గాల్లో ఉన్న టీడీపీ ఒపీనియన్ పో ల్స్‌ను ఐవీఆర్‌ఎస్ టెక్నాలజీ ద్వారా వినిపిస్తోంది. ఈ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వస్తాయని నకిలీ అభిప్రాయాలను వెలువరిస్తోంది. వైఎస్సార్ అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలుస్తారని టీడీపీ వర్గాలే చెబుతున్న చోట కూడా ఈ నకిలీ అభిప్రాయాలను ప్రజలపై రుద్దడంతో ఫోన్ రిసీవ్ చేసుకున్న వారు హాస్యాస్పదంగా ఉందని నవ్వుకుంటున్నారు. ఇటు వంటి సిగ్గులేని వ్యవహారాలకు కూడా టీడీపీ తెగబడుతోందని వారు బహిరంగంగా చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement