మోడీని కలవనున్న హీరో విజయ్
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని తమిళ కథానాయకుడు విజయ్ కలవనున్నారు.
చెన్నై: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని తమిళ కథానాయకుడు విజయ్ కలవనున్నారు. కోయంబత్తూరులో ఈ సాయంత్రం మోడీని కలవనున్నట్టు విజయ్ ట్విటర్లో పేర్కొన్నారు. 'రాజకీయేతర సమావేశానికి మోడీ నన్ను ఆహ్వానించారు. ఆయనతో భేటీ కానుండడం చాలా సంతోషం కలిగించే విషయం' అని విజయ్ ట్విటర్లో పోస్ట్ చేశారు.
Indeed privileged to be invited to a non-political meeting with Narendra Modi ji, looking forward to meet him.. -Vijay anna
— vijay (@Vijay_cjv) April 16, 2014గతవారం చెన్నైలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ను మోడీ కలిశారు. అయితే మర్యాదపూర్వకంగా తాము కలిసినట్టు రజనీ, మోడీ తెలిపారు. తెలుగు నటులు పవన్ కళ్యాణ్, నాగార్జున ఇప్పటికే మోడీని కలిశారు. పవన్ కళ్యాణ్ అయితే బీజేపీ తరపున ప్రచారం కూడా చేస్తున్నారు.


