రాహుల్‌కు ఈసీ షోకాజ్ | Showcause note to rahul from Election Commission | Sakshi
Sakshi News home page

రాహుల్‌కు ఈసీ షోకాజ్

May 10 2014 1:12 AM | Updated on Mar 18 2019 9:02 PM

రాహుల్‌కు ఈసీ షోకాజ్ - Sakshi

రాహుల్‌కు ఈసీ షోకాజ్

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి ఎన్నికల కమిషన్ షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఈ నెల 12వ తేదీ ఉదయం 11 గంటల్లోగా వివరణ ఇవ్వాలని లేనిపక్షంలో ఇతర సంప్రదింపులేవీ లేకుండా ఈసీ తదుపరి చర్యలు చేపడుతుందని పేర్కొంది.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి ఎన్నికల కమిషన్ షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఈ నెల 12వ తేదీ ఉదయం 11 గంటల్లోగా వివరణ ఇవ్వాలని లేనిపక్షంలో ఇతర సంప్రదింపులేవీ లేకుండా ఈసీ తదుపరి చర్యలు చేపడుతుందని పేర్కొంది. బీజేపీ అధికారంలోకి వస్తే హింసాకాండలో 22 వేలమంది చనిపోతారంటూ వ్యాఖ్యానించినట్టుగా వచ్చిన ఆరోపణల నేపథ్యంలో.. రాహుల్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్టు ప్రాథమికంగా గుర్తించిన ఈసీ నోటీసు జారీ చేసింది. హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్ బహిరంగ సభలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది.

 ఈవీఎం ప్రాంతంలోకి ప్రవేశంపై లోతుగా దర్యాప్తు

 ఇలావుండగా రాహుల్ ఓ పోలింగ్ బూత్‌లో ఈవీఎం ఉన్న ప్రాంతానికి వెళ్లడం ద్వారా ఎన్నికల నిబంధనలు ఏవైనా ఉల్లంఘించారా? అనే అంశం నిర్ధారించేందుకు మరింత లోతుగా విచారణ జరపాలని ఈసీ ఆదేశించింది. దీనిపై సోమవారానికల్లా నివేదిక అందుతుందని భావిస్తున్న కమిషన్.. అదేరోజు దానిపై నిర్ణయం తీసుకోనుంది. గత బుధవారం తన నియోజకవర్గమైన అమేథీలో పోలింగ్ సందర్భంగా రాహుల్ ఈవీఎం సమీపానికి వెళ్లడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement