శోభానాగిరెడ్డి మృతి విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్తాం | Shobha Nagi Reddy death issue to bring to Election Commission, says Bhanwar lal | Sakshi
Sakshi News home page

శోభానాగిరెడ్డి మృతి విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్తాం

Apr 24 2014 3:20 PM | Updated on Apr 4 2019 3:02 PM

శోభానాగిరెడ్డి మృతి విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్తాం - Sakshi

శోభానాగిరెడ్డి మృతి విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్తాం

వైఎస్సార్ సీసీ నాయకులు భూమా శోభానాగిరెడ్డి మృతి విషయాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ తెలిపారు.

హైదరాబాద్: వైఎస్సార్ సీసీ నాయకులు భూమా శోభానాగిరెడ్డి మృతి విషయాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ తెలిపారు. సిట్టింగ్ ఎమ్మెల్యేతో పాటు ప్రధానమైన పార్టీ నుండి పోటీలో ఉన్న విషయాన్ని ఈసీకి నివేదిస్తామన్నారు.

ఎన్నిక నిర్వహణపై కేంద్ర ఎన్నికల కమిషన్‌ తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌ నిర్ణయానికి అనుగుణంగా తాము ముందుకు వెళ్తామని భన్వర్‌లాల్‌ చెప్పారు. భూమా శోభానాగిరెడ్డి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా ఆళ్లగడ్డ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేశారు. అయితే రోడ్డు ప్రమాదంలో ఆమె మృతి చెందడంతో ఆళ్లగడ్డ ఎన్నికపై ఈసీ నిర్ణయం తీసుకోనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement