పురందేశ్వరికి బలంలేని స్థానం కేటాయింపు | Rajampet Lok sabha seat to Purandeswari | Sakshi
Sakshi News home page

పురందేశ్వరికి ఇరు పార్టీలకు బలంలేని స్థానం కేటాయింపు

Apr 16 2014 8:25 PM | Updated on Mar 29 2019 9:24 PM

పురందేశ్వరి - Sakshi

పురందేశ్వరి

కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరికి బిజెపి రాజంపేట లోక్‌సభ స్థానాన్ని కేటాయించింది.

హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరికి బిజెపి రాజంపేట లోక్‌సభ స్థానాన్ని కేటాయించింది. ఆమె గత లోక్సభ ఎన్నికలలో విశాపట్నం నుంచి గెలిచారు. ఆ చివరి విశాఖప్నటం నుంచి తీసుకువెళ్లి రాయలసీమలోని వైఎస్ఆర్ జిల్లా రాజంపేట స్థానం కేటాయించారు. అక్కడ బిజెపి గానీ, టిడిపికి గానీ బలంలేదు. టిడిపితో  పొత్తులో భాగంగా  ఏరికోరి ఓడిపోయే స్థానం ఆమెకు కేటాయించారని భావిస్తున్నారు.

పురందేశ్వరికి రాజంపేట స్థానం కేటాయించడం పట్ల బిజెపి శ్రేణుల్లో నిరాసక్తత నెలకొంది. బిజెపి అధిష్టానంపై చంద్రబాబు నాయుడు ఒత్తిడి మేరకే ఈ ఆమెకు ఓడిపోయే ఇటువంటి స్థానం కేటాయించారని భావిస్తున్నారు. పురందేశ్వరి పది సంవత్సరాలు ఎంపిగా ఉండి, కేంద్ర మంత్రిగా తన ప్రతిభను చూపుతూ జాతీయ స్థాయిలో బలమైన నాయకురాలిగా ఎదిగారు. ఢిల్లీలో పరిచయాలు పెంచుకున్నారు.  ఈ పరిస్థితులలో ఆమె మళ్లీ ఎంపిగా గెలిస్తే తనకు జాతీయ స్థాయిలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని చంద్రబాబు భయపడి ఇలా చేసి ఉంటారని భావిస్తున్నారు. ఆమెకు ఈ స్థానం కేటాయించడంతోనే ఇందులో చంద్రబాబు హస్తం ఉన్నట్లు అందరికీ అర్ధమైపోతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement