జోరుమీదున్న గోపీలు మారిపోతున్నారు పార్టీలు జారుకుంటున్న తీరులు చూస్తే వేడెక్కు బుర్రలు!
‘మధు’పర్కాలు: జోరుమీదున్న గోపీలు
మారిపోతున్నారు పార్టీలు
జారుకుంటున్న తీరులు
చూస్తే వేడెక్కు బుర్రలు!
గంట గంటకో సీను
మారిపోతుంటేను
అర్ధరాత్రి ఆపరేషను
తెల్లారితే పార్టీల పరేషాను!
ముప్పై ఆరు గంటలు
మారారు మూడు పార్టీలు
మైనంపల్లి కొత్త రికార్డులు
ఇవ్వాలి ఉత్తమ గోపీ అవార్డులు!
శ్రీశ్రీసూక్తం
ఏ యెండకు సరిపోయే
ఆయా గొడుగుల ధరించు నాతని బ్రదుకే
హేయ మటువంటి మానిసి
చేయడు తుది చిల్లిగవ్వ సిరిసిరిమువ్వా!
వినదగు మాట
ప్రజలు ఎక్కడ వెళ్లాలనుకుంటారో
అక్కడికి తీసుకెళ్లే వాడు నేత.
అయితే ప్రజలు ఎక్కడ వెళ్లాల్సి ఉందో
అక్కడికి తీసుకెళ్లే వాడే మహానేత
- రోజలిన్ కార్టర్
- రామదుర్గం మధుసూదనరావు