'ఆస్తులు కాపాడుకోడానికే పవన్ రాజకీయాలు'
ఇన్నాళ్లుగా సినిమాల్లో సంపాదించుకున్న ఆస్తులను కాపాడుకోడానికే పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ విమర్శించారు.
ఇన్నాళ్లుగా సినిమాల్లో సంపాదించుకున్న ఆస్తులను కాపాడుకోడానికే పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ విమర్శించారు. పవన్‌కల్యాణ్ పార్టీ గాలికి కొట్టుకుపోతుందని ఆయన ఎద్దేవా చేశారు.
ఇక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏమాత్రం విలువలు లేవని, మతతత్వ బీజేపీతో ఆయన చేతులు కలపడం సిగ్గు చేటని నారాయణ ఈ సందర్భంగా అన్నారు.


